వరుస డబుల్ సెంచరీలు.. ఐసీసీ ర్యాంకింగ్స్ లో దూసుకొచ్చిన జైష్వాల్?

praveen
ఇటీవల కాలంలో టీమిండియాలో యువ ఆటగాళ్ల హవా ఎంతలా పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎంతో మంది యంగ్ క్రికెటర్లు తమ ఆట తీరుతో ఆకట్టుకుంటూ ఉన్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇక భారత జట్టులో వచ్చిన ఛాన్సును సద్వినియోగం చేసుకుంటూ అదరగొట్టేస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే వచ్చిన తక్కువ సమయంలోనే టీమ్ ఇండియాలో తమ స్థానాన్ని సుస్థిరం చేసుకునేలాగే కనిపిస్తున్నారు చాలామంది క్రికెటర్లు.

 ఇలా టీమిండియాకు ఫ్యూచర్ తామే అన్న విషయాన్ని తమ ఆట తీరుతో నిరూపిస్తున్నారూ అని చెప్పాలి. అయితే ఇక భారత జట్టులోకి వచ్చిన తక్కువ సమయంలోనే మంచి ప్రదర్శన చేసి ఇక ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ప్రకటించే ర్యాంకింగ్స్ లో కూడా తమ సత్తా చాటుతూ ఉన్నారు. యశస్వి జైస్వాల్ ఈ కోవలోకి వస్తాడు. కాగా గత కొంతకాలం నుంచి టీమ్ ఇండియా తరఫున అదరగొడుతూ ఉన్నాడు యశస్వి జైస్వాల్. ప్రస్తుతం ఇంగ్లాండ్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో వరుసగా డబుల్ సెంచరీలు చేసి ఎన్నో రికార్డులు కొల్లగొట్టాడు అన్న విషయం తెలిసిందే. ఇలా బ్యాటింగ్ విధ్వంసం సృష్టించిన ఈ యువ ఆటగాడు ఇటీవల icc ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్ లో కూడా సత్తా చాటాడు అని చెప్పాలి.

 ఏకంగా ఐసిసి ర్యాంకింగ్స్ లో టాప్ 15 లో నిలిచాడు ఈ యువ ఆటగాడు. ఏకంగా ఒకేసారి 14 ర్యాంకులు ఎగబాకి టాప్ 15 బ్యాట్స్మెన్ గా అవతరించాడు. ఇంగ్లాండుతో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో వరుసగా రెండు డబుల్ సెంచరీలు చేయడంతో.. ఇక యశస్వి జైష్వాల్ రేటింగ్ పాయింట్లు అమాంతం పెరిగిపోయాయి. అయితే వచ్చే టెస్ట్ మ్యాచ్ లోను ఇలాంటి ప్రదర్శన చేస్తే ఐసీసీ ర్యాంకింగ్స్ లో తప్పకుండా అతను టాప్ టెన్ లోకి రావడం ఖాయమని ఎంతోమంది క్రికెట్ విశ్లేషకులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అతని బ్యాటింగ్ జోరు చూస్తుంటే టాప్ 10 కాదు అతి తక్కువ సమయంలోనే టాప్ వన్ కి వచ్చేలా కనిపిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: