టి20 ఫార్మాట్లో.. అరుదైన రికార్డు అందుకున్న శ్రీలంక బౌలర్?

praveen
ఇటీవల కాలంలో టి20 ఫార్మాట్ కు అంతర్జాతీయ క్రికెట్లో పెరిగిపోతున్న ఆదరణ అంతా ఇంత కాదు. మిగతా ఫార్మట్లను పక్కనపెట్టి మరి ఈ పొట్టి ఫార్మాట్ ను తెగ ఇష్టపడుతున్నారు క్రికెట్ లవర్స్. అయితే సాధారణంగా టి20 ఫార్మాట్లో బ్యాట్స్మెన్ లదే ఆదిపత్యం కొనసాగుతూ ఉంటుంది అని క్రికెట్ విశ్లేషకులు చెబుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే తక్కువ బంతుల్లోనే ఎక్కువ పరుగులు చేయాలి అనే ఒత్తిడి ప్రతి బ్యాట్స్మెన్ పై కూడా ఉంటుంది. దీంతో క్రీజ్ లోకి వచ్చిన బ్యాట్స్మెన్ ఇక కొన్ని బంతులు ఎదుర్కొని క్రీజ్ లో కుదురుకోవాలి అనుకోవడం కంటే ఇక మొదటి బంతి నుంచి సిక్సర్లు ఫోర్ లతో  చెలరేగి పోవాలి అనే మైండ్ సెట్ తో ఇక బలిలోకి దిగుతూ ఉంటాడు.

 ఇలాంటి సమయంలో ఇక పరుగులను కట్టడి చేయడం.. అటు అటు బౌలర్లకు ఒక అతిపెద్ద సవాలుగా మారిపోతూ ఉంటుంది. పరుగులు కట్టడి చేయడమే కష్టం అనుకుంటే చివరికి ఇక వికెట్లు పడగొట్టడం అంటే కేవలం కొంతమంది బౌలర్లకు మాత్రమే ఇది సాధ్యమవుతూ ఉంటుంది. అయితే కొంతమంది బౌలర్లు ఇలా ఏకంగా బ్యాట్స్మెన్ల ఆదిపత్యం కొనసాగే టి20 ఫార్మాట్లో సైతం తమ బౌలింగ్ తో ఎన్నో అద్భుతాలు చేసి చూపిస్తూ ఉంటారు.  అరుదైన రికార్డులు కూడా కొల్లగొడుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అంతర్జాతీయ టి20లలో శ్రీలంక స్పిన్నర్ హసరంగ అరుదైన రికార్డును అందుకున్నాడు.

 పొట్టి ఫార్మాట్లో అత్యంత వేగంగా 100 వికెట్లు సాధించిన ఘనతను అందుకున్న శ్రీలంక బౌలర్గా నిలిచాడు హసరంగ. ఇటీవల ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన టి20 మ్యాచ్ లో రెండు వికెట్లు పడగొట్టడం ద్వారా ఈ ఘనతను సాధించాడు అని చెప్పాలి. అయితే కేవలం 63 మ్యాచ్లలోనే హస్సరంగా ఇలా 100 వికెట్ల మార్క్ అందుకోవడం గమనార్హం. ఇక ఆ తర్వాత స్థానంలో శ్రీలంకకు చెందిన మరో దిగ్గజ బౌలర్ మలింగ 76 మ్యాచులలో 100 వికెట్లు అందుకున్నాడు. అయితే ఓవరాల్ గా చూసుకుంటే 100 వికెట్లను అత్యంత వేగంగా తీసిన బౌలర్గా ఆఫ్ఘనిస్తాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ ఉన్నాడు. కేవలం 56 మ్యాచ్లలో ఈ ఘనతను అందుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: