సర్పరాజ్ ఖాన్ జెర్సీ నెంబర్ వెనుక.. ఇంత పెద్ద సీక్రెట్ గా ఉందా?

praveen
సాధారణంగా ప్రొఫెషనల్ క్రికెట్ ఆడుతున్న ప్రతి ఆటగాడు కూడా ఇక తమకు ఇష్టమైన నెంబర్ ని జెర్సీ నెంబర్గా పెట్టుకోవడం చేస్తూ ఉంటారు అనే విషయం తెలిసిందే. అయితే ఇక బిసిసిఐ కొంతమంది లెజెండ్స్ జెర్సీ నెంబర్లను మరో ఆటగాడు వాడుకునేందుకు అవకాశం కల్పించలేదు.సచిన్ టెండూల్కర్ మహేంద్ర సింగ్, ధోనీ లాంటి లెజెండ్స్ ధరించిన జెర్సీ నెంబర్లకు కూడా ఇక వీడ్కోలు పలికింది బీసీసీఐ. దీంతో ఆయా జెర్సీ నెంబర్ కాకుండా ప్రతి ఆటగాడు తమకు నచ్చిన చర్చి నెంబర్ పెట్టుకునేందుకు అవకాశం ఉంటుంది అన్న విషయం తెలిసిందే.

 అయితే ఒక్కొక్కరు ఒక్కో సెంటిమెంట్ ను ఆధారంగా చేసుకుని తమ జెర్సీ నెంబర్ను సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే ఆయా ఆటగాళ్లు జెర్సీ నెంబర్ సెలెక్ట్ చేసుకోవడం వెనక ఉన్న సెంటిమెంట్ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతూ ఉంటుంది. అయితే ఇలా ఎవరైనా ఆటగాడు జెర్సీ నెంబర్ వెనుక ఉన్న సీక్రెట్ రివీల్ అయింది అంటే ఇక దాని గురించి తెలుసుకోవడానికి అందరూ కూడా ఎంతో ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు అని విషయం తెలిసిందే. అయితే ఇటీవల భారత జట్టులోకి ఎన్నో ఏళ్ల నిరీక్షణ తర్వాత ఎంట్రీ ఇచ్చాడు యువ ఆటగాడు సర్పరాజ్ ఖాన్ .

 మొదటి మ్యాచ్ లోనే తన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు అన్న విషయం తెలిసిందే. సర్పరాజ్ ఖాన్ 97 నెంబర్ కలిగిన జెర్సీని ధరిస్తూ ఉంటాడు. అయితే అతని జెర్సీ నెంబర్ వేనుక ఒక పెద్ద స్టోరీనే ఉందట. హిందీలో నౌ అంటే 9, సాత్ అంటే ఏడు అని. రెండు కలిపితే వచ్చే పేరు నౌషద్. సర్పరాజ్  తండ్రి పేరు నౌషద్. కానీ ఇలా తన తండ్రి పేరు కలిసి వచ్చేలా 97 జెర్సీ నెంబర్ ధరిస్తూ ఉన్నాడు సర్ఫరాజ్ ఖాన్. సర్పరాజ్ సోదరుడు ముషీర్ ఖాన్ కూడా 97 జెర్సీని ధరిస్తాడు అని సర్ఫరాజ్ తండ్రి నౌషద్ వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: