అప్పుడు ఇండియాకు వరల్డ్ కప్ అందించాడు.. ఇప్పుడు వారికి కొత్త జీవితం ఇచ్చాడు?

praveen
నేటి ఆధునిక సమాజంలో స్వార్థపూరిత మనుషులు ఎంతలా పెరిగిపోతున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు నేను నా కుటుంబం బాగుంటే చాలు ఎవరు ఎటు పోతే మాకేంటి అన్న విధంగా స్వార్థపూరితంగా ఆలోచిస్తున్నారు. ఏకంగా స్వలాభం కోసం ఏం చేయడానికి అయినా సిద్ధమవుతూ ఉంటారు. ఇలాంటి స్వార్థపూరిత సమాజంలో కూడా ఇంకా పక్క వాళ్ళ గురించి మానవత్వంతో ఆలోచించే మనుషులు ఉన్నారు అన్నది అప్పుడప్పుడు వెలుగులోకి వచ్చే ఘటనల ద్వారా అర్థమవుతూ ఉంటుంది.

 ఏకంగా కష్టాల్లో ఉన్న ఎదుటివారిని ఆదుకోవడానికి గొప్ప మనసు చేసుకొని ముందుకు వచ్చే వారు కూడా ఉన్నారు అని కొన్ని ఘటనల ద్వారా తెలుస్తూ ఉంటుంది. ఇక ఇప్పుడు ఇలాంటి ఒక గొప్ప వ్యక్తి గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. అతను ఎవరో కాదు.. భారత క్రికెట్ ప్రేక్షకులందరికీ సుపరిచితుడే. 2011 సంవత్సరంలో మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్సీ లో టీమిండియా వరల్డ్ కప్ గెలిచినప్పుడు ఇక భారత క్రికెట్ ప్రేక్షకులందరూ ఎంతలా సంతోషంలో మునిగిపోయారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఈ సంతోషం అందరికీ ఇవ్వడంలో భాగమయ్యాడు గేరి కిర్ స్టన్ .

 ఏకంగా ధోని కెప్టెన్సీలో వరల్డ్ కప్ ఆడిన జట్టుకు కోచ్ గా వ్యవహరించి తన అనుభవంతో జట్టు ఆటగాళ్లను మరింత అద్భుతంగా రాణించేలా చేశాడు. ఈ క్రమంలోనే భారత జట్టుకు 2011 వరల్డ్ కప్ అందేలా చేసి మరుపురాని విజయాన్ని అందించాడు. అయితే ఇక ఇప్పుడు గొప్ప మనసును చాటుకున్నాడు. ఆ వరల్డ్ కప్ తర్వాత స్వదేశమైన సౌత్ఆఫ్రికా చేరుకున్నాక ఖాయోలిట్షా అనే ప్రాంతంలో పరిస్థితులు చూసి చలించి పోయారు గేరి కిర్ స్టన్. డ్రగ్స్, నేరాలతో నిండిపోయిన ఆ ప్రాంతంలో పిల్లలు వాటి ప్రభావితం కాకూడదని ఏకంగా ఏకంగా ఒక చారిటీని స్థాపించి అందరికీ క్రికెట్ నేర్పిస్తున్నాడు. వందల మంది పిల్లలకు ఏకంగా క్రికెట్లో శిక్షణ ఇప్పిస్తూ ఉన్నాడు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: