నిన్న ప్రత్యర్థులు.. నేడు సహచరులు?

praveen
నేటి మోడ్రన్ క్రికెట్లో ఎన్నో వింతలు విశేషాలు జరుగుతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నేటితరం క్రికెటర్లలో సాధ్యం కానిది అంటూ ఇంకేది లేదు అనే విధంగా ఎన్నో ఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఒకప్పుడు అయితే క్రికెటర్లు తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నారు అంటే చాలు వారు ప్రత్యర్ధులుగా ఎప్పుడూ అంతర్జాతీయ మ్యాచ్లలో తలబడుతూ ఉండేవారు. ఇక కొన్ని కొన్ని సార్లు ఇక ఇలా ప్రత్యర్థి ఆటగాళ్లు కనీసం మాట్లాడుకునే వారు కూడా కాదు. కానీ ఇప్పుడు మాత్రం మోడ్రన్ క్రికెట్లో ప్రత్యర్థులు సహచరులుగా సహచరులు ప్రత్యర్థులుగా మారిపోతున్నారు.

 అంతర్జాతీయ క్రికెట్లో ప్రత్యర్ధులుగా కొనసాగుతూ హోరాహోరీగా ఢీ కొట్టిన వారు ఇక ఇప్పుడు ఆయా దేశాల క్రికెట్ బోర్డులు నిర్వహిస్తున్న టి20 లీగ్లలో సహచరులుగా మారిపోయి ఒక జట్టు కోసం పోరాటం కొనసాగిస్తున్నారు. అయితే ఒకే జట్టు తరఫున సహచరులు మాత్రం ఏకంగా ఇలాంటి టీ20 లీగ్లలో ప్రత్యర్థులుగా మారిపోతున్నారు అని చెప్పాలి. ఇక ఇప్పుడు ఇద్దరు క్రికెటర్ల మధ్య కూడా ఇలాగే జరిగింది. నిన్న ప్రత్యర్ధులుగా ఉన్న ఆటగాళ్లు నేడు సహచరులుగా మారిపోయారూ. ఇటీవల కాలంలో ఎన్నో దేశాల క్రికెట్ బోర్డులు t20 టోర్నీలను ప్రారంభిస్తూ ఉండడంతో ఇక ఇలాంటివి తరచూ జరుగుతూనే వస్తున్నాయి అన్న విషయం తెలిసిందే.

 ఒక టి20 టోర్నీలో ప్రత్యర్థులుగా ఆడుతున్న ఆటగాళ్లు అలాంటిదే మరో టోర్నీలో ఒకే జట్టులో ఆడుతూ సహచరులుగా మారిపోయారు. ఆస్ట్రేలియా, వెస్ట్ ఇండీస్ మధ్య జరిగిన మూడో టి20 మ్యాచ్ లో ప్రత్యర్ధులుగా ఆడిన పూరన్, టీమ్ డేవిడ్ ఇక ఇప్పుడూ ఇంటర్నేషనల్ లీగ్ టి20 జట్టుకు ఆడుతూ సహచరులుగా మారిపోయారు. అయితే ఇప్పుడు క్రికెట్ అనేది ఒక బిజినెస్ గా మారిపోయిందని.. డబ్బు కోసం క్రికెటర్లు నిర్విరామంగా విశ్రాంతి లేకుండా క్రికెట్ ఆడుతున్నారు అంటూ ఎంతో మంది నెటిజెన్స్ దీనిపై కామెంట్లు చేస్తూ ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: