యువరాజ్ సింగ్ ఫ్యాన్స్ కు పండగ లాంటి న్యూస్.. మళ్లీ బరిలోకి దిగబోతున్నాదట?

praveen
టీమ్ ఇండియా మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ కి అటు భారత క్రికెట్ హిస్టరీలో ఉన్న క్రేజీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మహేంద్రసింగ్ ధోనీ కెప్టెన్సీ లో టీమిండియా రెండు వరల్డ్ కప్ లు గెలిచింది అని మాత్రమే చాలామంది ప్రేక్షకులకు తెలుసు. కానీ ఈ వరల్డ్ కప్ విజయాలలో అటు యువరాజ్ సింగ్ తన ఆల్ రౌండ్ ప్రదర్శనతో కీలకపాత్ర వహించాడు అని చెప్పాలి. ధోనీతో కలిసి వీరోచితమైన ఇన్నింగ్స్ లు ఆడుతూ ఇక జట్టును విజయతీరాలకు నడిపించాడు. ఇలా యువరాజ్ సింగ్ కెరియర్ లో ఎన్నో చిరస్మరణీయమైన ఇన్నింగ్స్ లు ఉన్నాయి అనడంలో సందేహం లేదు.

 ఒకవైపు క్యాన్సర్ వ్యాధి అతన్ని క్రికెట్ నుంచి వెనక్కి లాగుతున్న అతను మాత్రం పట్టు విడువని విక్రమార్కుడిలా తన ఆటను కొనసాగించి.. భారత జట్టుకు అద్వితీయమైన విజయాలను అందించాడు. అంతేకాదు ఆరు బంతుల్లో ఆరు సిక్సర్ల రికార్డును కూడా సాధించి క్రికెట్ చరిత్ర పుటల్లోకి ఎక్కాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఇక రిటైర్మెంట్ తర్వాత కూడా ఏదో ఒక విధంగా క్రికెట్కు దగ్గరగా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు యువరాజ్ సింగ్. అయితే ఒకప్పుడు ఇక తన బ్యాటింగ్తో మెరుపులు మెరుపించి  అభిమానులు అందరినీ కూడా అలరించిన ఈ విధ్వంసకరమైన మాజీ ఆల్ రౌండర్.. ఇక ఇప్పుడు మరోసారి బ్యాడ్ పట్టుకొని మైదానంలోకి దిగేందుకు సిద్ధమవుతున్నాడు అనేది తెలుస్తుంది. ఈ క్రమంలోనే యువరాజ్ సింగ్ అభిమానులందరికీ కూడా ఒక పండగ లాంటి న్యూస్ అందింది.

 టీమిండియా మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ మరోసారి బ్యాటింగ్ తో ప్రేక్షకులను అలరించబోతున్నాడట. లెజెండ్స్ క్రికెట్ ట్రోఫీ 2024లో న్యూయార్క్ సూపర్ స్టార్ స్ట్రైకర్స్ జట్టుకి యువరాజ్ సింగ్ ని కెప్టెన్ గా నియమించినట్లు ఆ ఫ్రాంచైజీ ఇటీవల వెల్లడించింది. శ్రీలంకలోని కాండీ వేదికగా మార్చ్ ఏడవ తేదీ నుంచి 18వ తేదీ వరకు కూడా ఈ టోర్నీ జరగబోతుంది అని చెప్పాలి. 90 బాల్స్ ఫార్మాట్లో ఇక ఈ టోర్న నిర్వహించబోతున్నారు అని సమాచారం. సాధారణంగానే 20 ఓవర్లు ఉంటేనే యువరాజ్ సింగ్ విధ్వంసం సృష్టిస్తాడు. అలాంటిది కేవలం 90 బాల్స్ ఫార్మాట్ అంటే మరోసారి పాత యువరాజ్ సింగ్ ని చూడొచ్చు అని అభిమానులు అందరూ కూడా అనుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: