కన్నతల్లికి డబ్బు ఇవ్వడం.. గృహహింస కాదు : కోర్టు

praveen
సాదరణంగా ఎన్నో సినిమాల్లో అత్త కోడళ్ళకి అస్సలు పడదు అన్నట్లుగా సన్నివేశాలలో చూపిస్తూ ఉంటారు. ఇన్నాళ్లు నా మాట వింటూ నేను చెప్పినట్టు నడుచుకున్న కొడుకుని.. ఇక కోడలు తన వైపుకు తిప్పుకుంటుంది అంటూ తల్లి.. అయితే పెళ్లయిన తర్వాత కూడా ఇంకా తల్లి మాటే వింటున్నాడు అని భార్య.. ఇలా ఇద్దరు కూడా ఎప్పుడు శత్రువులు అన్నట్లుగానే వ్యవహరిస్తూ ఉంటారు. అయితే సీరియల్స్ లో అయితే అత్తా కోడళ్ల మధ్య ఉండే గొడవలను మరింత హైలెట్ చేసి చూపించి ఎక్కువ రేటింగ్స్ సొంతం చేసుకోవడానికి కూడా ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే సీరియల్స్ సినిమాలు మాత్రమే కాదు రియల్ లైఫ్ లో కూడా అత్తా కోడళ్ళ మధ్య దాదాపు ఇదే పరిస్థితి ఉంటుంది అన్న విషయం తెలిసిందే.

 ఎప్పుడూ ఏదో ఒక విషయంపై అత్తా కోడళ్ల మధ్య భేదాభిప్రాయాలు వస్తూనే ఉంటాయి. ఈ క్రమంలోనే ఒక వైపుకు తల్లికి సర్ది చెప్పలేక ఇంకోవైపు భార్యకు నచ్చజెప్పలేక.. ఇక భర్త ఇద్దరి మధ్య నలిగిపోతూ ఉంటాడు. ఈ విషయం పెళ్లయిన వాళ్లకు బాగా అర్థమవుతూ ఉంటుంది. అయితే ఎప్పుడైనా ఇక తన తల్లికి ఖర్చులకోసం భర్త డబ్బులు ఇచ్చాడు అంటే చాలు భార్య పెద్ద రాద్ధాంతమే చేస్తూ ఉంటుంది. అలా ఎలా నువ్వు డబ్బులు ఇస్తావు అంటూ గొడవ పెట్టుకోవడం కూడా చేస్తూ ఉంటారు కొంతమంది భార్యలు. ఇక్కడ ఒక భార్య ఇలాంటిదే చేసింది. ఏకంగా తన భర్త తన తల్లికి డబ్బులు ఇస్తున్నాడు అంటూ ఆరోపిస్తూ కోర్టును ఆశ్రయించింది భార్య.

 ఏకంగా గృహహింస చట్టం కింద పిటిషన్ దాఖలు చేసింది. అయితే ఈ పిటీషన్ పై విచారణ జరిపిన ముంబై కోర్టు ఆసక్తికరమైన తీర్పును ఇచ్చింది. ఒక కొడుకు తన తల్లికి సమయం డబ్బు ఇవ్వడం గృహహింస కిందికి రాదు అంటూ తేల్చి చెప్పింది కోర్టు. తన భర్త తరచూ తల్లికి డబ్బు ఇస్తుండడంతో పాటు ఎక్కువ సమయం ఆమెకే కేటాయిస్తున్నాడని.. దీనివల్ల అతను వైవాహిక జీవితం దెబ్బతింటుంది అంటూ 43 ఏళ్ల వివాహిత కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. ముంబై కోర్టు ఇలాంటి ఆసక్తికరమైన తీర్పును ఇచ్చింది. పూర్తి విచారణ జరిపిన తర్వాత భార్య దగ్గర గృహహింసకు సంబంధించిన ఆధారాలు ఏమీ లేవు అంటూ తేల్చి చెప్పింది కోర్టు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: