చితక్కొట్టుడు అంటే ఏంటో చూపించాడు.. 29 బంతుల్లోనే?

praveen
సాధారణంగా టి20 ఫార్మాట్లో బ్యాట్స్మెన్ లదే పైచేయిగా కొనసాగుతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే అతి తక్కువ బంతుల్లో ఎక్కువ పరుగులు చేయాల్సి ఉంటుంది. దీంతో క్రీజ్ లోకి వచ్చిన ప్రతి బ్యాట్స్మెన్ కూడా ఇక సిక్సర్లు ఫోర్ లతో చెలరేగిపోవడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాడు. ఈ క్రమంలోనే కొంతమంది బ్యాట్స్మెన్లు ఇలా బ్యాటింగ్ విధ్వంసం సృష్టించడంలో విఫలం అవుతూ ఉంటే.. ఇంకొంతమంది బ్యాట్స్మెన్లు మాత్రం తమ బ్యాటింగ్ విధ్వంసంతో ఎన్నో రికార్డులు కొల్లగొడుతూ ఉంటారు అని చెప్పాలి.

 ఏకంగా ప్రత్యర్థి బౌలర్లకు ముచ్చమటలు పట్టిస్తూ ఉంటారు చాలామంది బ్యాట్స్మెన్లు. ఇక ఇలాంటి తరహా ఇన్నింగ్స్ ఏదైనా మ్యాచ్లో జరిగింది అంటే చాలు ఆ ఇన్నింగ్స్ గురించి అందరూ చర్చించుకుంటూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటివరకు విధ్వంసకరమైన బ్యాటింగ్ గురించి అందరూ వినే ఉంటారు. కానీ బ్యాటింగ్లో చితక్కొట్టుడు అంటే ఎలా ఉంటుందో మాత్రం ఇక్కడ ఒక బ్యాట్స్మెన్ నిరూపించాడు. అతను ఎవరో కాదు వెస్టిండీస్ జట్టులో కీలక ప్లేయర్గా కొనసాగుతున్న రస్సెల్. ఇక రస్సెల్ బ్యాటింగ్ విధ్వంసం ఏ రేంజ్ లో ఉంటుందో అటు ఐపిఎల్ లో చాలాసార్లు భారత క్రికెట్ ప్రేక్షకులు చూశారు.  ఒక్కసారి క్రీజులో కుదురుకున్నాడు అంటే బౌలర్ల వెన్నులో వణుకు పుట్టే విధంగా దంచి కొట్టుడు కొడుతూ ఉంటాడు.

 ఇటీవల ఆస్ట్రేలియా తో జరిగిన మ్యాచ్ లో కూడా ఇక వీరబాదుడు అంటే ఎలా ఉంటుందో తన బ్యాటింగ్ తో చూపించాడు రస్సెల్. ఏకంగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టి20 మ్యాచ్లో కంగారు బౌలర్లను కంగారెత్తించాడు. కేవలం 29 బంతుల్లోడా 7 సిక్సర్లు నాలుగు ఫోర్లతో 71 పరుగులు చేశాడు. 79/5 పరుగులతో తన జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు క్రీజ్ లోకి వచ్చిన రస్సెల్ ఏకంగా ఆస్ట్రేలియా బౌలర్లపై  ఎదురుదాడికి దిగారు. దీంతో ఇక 20 ఓవర్లు పూర్తయ్యే సరికి వెస్టిండీస్ జట్టు స్కోరు 220/6 పరుగులకు చేరుకుంది. ఇక ఈ మ్యాచ్ లో వెస్టిండీస్ జట్టు ఘనవిజయాన్ని అందుకుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: