కేవలం రెండు మ్యాచ్లతోనే.. ఆ తెలుగు క్రికెటర్ పై నమ్మకాన్ని కోల్పోవద్దు : ఆకాష్ చోప్రా

praveen
భారత క్రికెట్లో కొత్త ప్రతిభకు కొదవ లేకుండా పోయింది అన్న విషయం తెలిసిందే  ఎప్పటికప్పుడు కొత్త ఆటగాళ్లు తెరమీదకి వస్తూ ఇక భారత జట్టులో చోటు సంపాదించుకుంటూనే ఉన్నారు. దేశవాళి క్రికెట్లో అదరగొడుతూ సెలెక్టర్లు చూపును ఆకర్షించి ఇక తమకు తిరుగులేదు అని నిరూపిస్తూ ఉన్నారు అని చెప్పాలి. దీంతో ఇటీవల కాలంలో భారత జట్టు పూర్తిగా యువ ఆటగాళ్లతో నిండిపోయింది. ఇలాంటి సమయంలో ప్రతి ఒక్కరు కూడా ప్రతి మ్యాచ్ లో బాగా రాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకటి రెండు మ్యాచ్లలో బాగా రాణించలేదు అంటే సెలెక్టరు నిర్మొహమాటంగా వారిని పక్కన పెట్టేస్తున్నారు.

 అయితే ఇక ఇటీవలే తెలుగు క్రికెటర్ కేఎస్ భరత్ విషయంలో కూడా ఇదే జరుగుతుంది అన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం భారత జట్టు ఇంగ్లాండ్తో ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడుతుంది. అయితే ఇక ఈ టెస్ట్ సిరీస్ లో యువ ఆటగాళ్లకు ఛాన్సులు కల్పించారు బీసీసీఐ సెలెక్టర్లు. ఈ క్రమంలోనే తెలుగు ప్లేయర్ కేఎస్ భరత్ ఇక మొదటి రెండు మ్యాచ్లలో కూడా అవకాశాలు దక్కించుకున్నాడు. అవకాశాలు అయితే దక్కించుకున్నాడు కానీ ఎందుకో బ్యాటింగ్లో మాత్రం పెద్దగా రాణించలేకపోయాడు. ఫీల్డింగ్ లో మాత్రం తన నైపుణ్యంతో ఆకట్టుకున్నాడు.

 అయితే బ్యాటింగ్లో పెద్దగా రానించకపోవడంతో మిగిలిన మూడు టెస్ట్ మ్యాచ్లకి అతనికి తుది జట్టులో చోటు దక్కడం కష్టంగానే మారిపోయింది. ఇలాంటి పరిస్థితుల మధ్య భారత మాజీ ప్లేయర్ ఆకాష్ చోప్రా తెలుగు క్రికెటర్ కెఎస్ భరత్ కు అండగా నిలిచాడు. ఇంగ్లాండ్తో మిగిలిన మూడు టెస్టులకు భారత్ ను కీపర్ గా కొనసాగించాలి అంటూ కోరాడు. కీపింగ్ ప్రతిభ ఆధారంగానే అతనిపై నిర్ణయం తీసుకోవాలి. గత రెండు మ్యాచ్లలో అతను బ్యాటింగ్ అద్భుతంగా లేకపోయినా.. పరవాలేదు అనే విధంగా ఉంది   అయితే కేవలం రెండు మ్యాచ్లలోనే భరత్ పై సెలెక్టరు నమ్మకాన్ని కోల్పోవద్దు అంటూ ఆకాష్ చోప్రా సూచించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: