ప్రపంచంలోనే అతను ప్రమాదకరమైన బ్యాటర్.. కోహ్లీ పేరు చెప్పని షమి?

praveen
టీమ్ ఇండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీకి వరల్డ్ క్రికెట్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలోనే తన సత్తా ఏంటో వరల్డ్ క్రికెట్ ప్రేక్షకులకు అర్థమయ్యేలా చేశాడు. ఈ క్రమంలోనే ఇప్పటివరకు కోహ్లీ కెరియర్ లో ఎంతో మంది లెజెండ్స్ సాధించిన ఆరుదైన రికార్డులను సైతం బద్దలు కొట్టాడు. ఇక రికార్డుల వేట కొనసాగిస్తూనే ఉన్నాడు. మూడు ఫార్మట్లలో కూడా కీలక ప్లేయర్గా కొనసాగుతూ భారత జట్టు విజయాలలో భాగం అవుతున్నాడు కోహ్లీ.

 అయితే వరల్డ్ లో బెస్ట్ బ్యాట్స్మెన్ ఎవరు అంటే ప్రతి ఒక్కరు కూడా విరాట్ కోహ్లీ పేరు చెప్పేస్తూ ఉంటారు. ఎందుకంటే నేటి తరంలో అతన్ని మించిన బ్యాట్స్మెన్ మరొకరు లేరు అనడంలో సందేహం లేదు. కానీ టీమిండియా స్టార్ బౌలర్ మహమ్మద్ షమీ మాత్రం అటు విరాట్ కోహ్లీ పేరు కాకుండా మరో బ్యాటరీ పేరు చెప్పాడు అని చెప్పాలి. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న మహమ్మద్ షమీ ప్రపంచంలోనే.. అతి ప్రమాదకరమైన బ్యాట్స్మెన్ ఎవరు అన్న విషయాన్ని చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలోనే కోహ్లీ పేరును చెప్పలేదు. మరి ఇంతకీ శమీ ఎవరి పేరుని చెప్పాడు అంటారా.. ఇంకెవరి పేరో కాదు ప్రస్తుతం టీమిండియా కెప్టెన్గా కొనసాగుతూ భారత క్రికెట్లో హిట్ మాన్ గా ఉన్న రోహిత్ పేరు చెప్పాడు.

 ఏకంగా రోహిత్ శర్మ ప్రపంచ క్రికెట్లోనే అత్యంత ప్రమాదకరమైన బ్యాట్స్మెన్ అంటూ ఏకంగా ప్రశంసలు కురిపించాడు మహమ్మద్ షమి. ఇక రోహిత్ ఎలాంటి పిచ్ పైన అయినా సత్తా చాటగలడు అంటూ ప్రశంసించాడు. ఈ క్రమంలోనే మహమ్మద్ షమీ చేసిన కామెంట్స్ కాస్త వైరల్ గా మారిపోయాయి. అయితే గత కొంతకాలం నుంచి చీలమండ గాయం కారణంగా టీమిండియా కు అందుబాటులో ఉండడం లేదు. ఏకంగా వరల్డ్ కప్ సమయంలో అతనికి గాయం కావడంతో అక్కడి.. నుంచి టీమిండియా వరుసగా సిరీస్ లు ఆడుతున్న అతను మాత్రం ఫిట్నెస్ సాధించకపోవడంతో జట్టుకు దూరమయ్యాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: