వరుస చాన్సులు.. అయినా ఆ తెలుగు క్రికెటర్ ఇలా చేస్తున్నాడేంటి?

praveen
ఇటీవల కాలంలో భారత క్రికెట్లో ఎంత తీవ్రమైన పోటీ నెలకొందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. టీమ్ ఇండియాలోకి రావాలని ఎంతో మంది యువ ఆటగాళ్లు ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే దేశవాలి క్రికెట్ లో వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ అద్భుతమైన ప్రదర్శన చేస్తూ ఉండడం కూడా చూస్తూ ఉన్నాం. అయితే ఇలాంటి సమయంలో  బిసిసిఐ సెలెక్టర్లు కూడా చాలామంది యువ క్రికెటర్లకు ఛాన్సులు ఇస్తున్నారు.

 అదే సమయంలో ఇక కొంతమంది క్రికెటర్లకు విఫలమవుతున్న వరుసగా అవకాశాలు ఇస్తూ ఉండడం గమనార్హం. అలాంటి వారిలో తెలుగు క్రికెటర్ కె ఎస్ భరత్ కూడా ఒకరు అని చెప్పాలి. సాధారణంగా అయితే బీసీసీఐ సెలెక్టర్లు ఒకటి రెండు మ్యాచ్లలో మంచి ప్రదర్శన చేయకపోతే.. చివరికి వారిని పక్కన పెట్టడం చేస్తూ ఉంటారు. కానీ కేఎస్ భరత్ విషయంలో మాత్రం సెలెక్టర్లు ప్రతిసారి కూడా సానుకూలంగానే ఉంటున్నారు. అతనికి జట్టులో చోటు కల్పిస్తూనే ఉన్నారు. అయితే ఇలా అతనికి వరుసగా అవకాశాలు ఇవ్వడానికి కారణం.. అతను బ్యాటర్ తో పాటు వికెట్ కీపర్ కూడా కావడం గమనార్హం.
 అయితే బీసీసీఐ సెలెక్టర్లు ఈ తెలుగు క్రికెటర్ కి ఎన్ని సార్లు ఛాన్స్ ఇస్తున్న ఎందుకో సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడు. వికెట్ కీపింగ్ తో పర్వాలేదు అనిపిస్తున్న బ్యాటింగ్ తో మాత్రం అకట్టుకోలేకపోతున్నాడు. ఇప్పటివరకు టీమిండియా తరఫున ఏడు టెస్ట్ మ్యాచ్లు ఆడిన ఈ ప్లేయర్ 12 ఇన్నింగ్స్ లో 221 పరుగులు మాత్రమే చేశాడు. ఇక అతను ఇన్నింగ్స్ లో ఒక్క అర్థ సెంచరీ కూడా లేకపోవడం గమనార్హం. అయితే అద్భుతమైన కీపింగ్ నైపుణ్యంతో జట్టులో చోటు సంపాదించుకుంటున్న కేఎస్ భరత్ బ్యాటింగ్లో విఫలమవుతున్నాడు. దీంతో ఇక టీమిండియా ఆడబోయే మిగిలిన మూడు టెస్ట్ లకు అతను జట్టులో ఉండడం కష్టమే అన్నది తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: