5 నెలల చిన్నారి.. గిన్నిస్ వరల్డ్ రికార్డ్.. ఇంతకీ ఏం చేసిందంటే?

praveen
సాధారణంగా ఈ భూమి మీద ఉండే మనుషులు ఒక్కొక్కరికి ఒక్క పిచ్చి ఉంటుంది. బాగా డబ్బు సంపాదించాలని ఒక్కరికి పిచ్చి ఉంటే.. మంచి ఉద్యోగం సంపాదించుకోవాలని ఇంకొకరికి పిచ్చి ఉంటుంది. ఇక పరీక్షల్లో అత్యుత్తమ మార్కులు సంపాదించాలని మరికొంతమంది ఆశ పడుతూ ఉంటారు. అచ్చం ఇలాగే ప్రపంచ రికార్డులు సాధించాలని కూడా చాలామందికి పిచ్చి ఉంటుంది. ఏకంగా ప్రపంచ రికార్డుల్లో తమ పేరును చూసుకుంటే ఆ ఆనందం వర్ణించలేని విధంగా ఉంటుంది అని ఎంతోమంది చెబుతూ ఉంటారు.

 ఈ క్రమంలోనే వరల్డ్ రికార్డులు సాధించేందుకు.. ఇక ఏదో ఒక పనిపై ఏళ్ల తరబడి కఠిన సాధన చేసి ప్రపంచంలో ఎవ్వరు కూడా ఆ ఆ పనిని తమలా చేయలేరు అన్న విషయాన్ని నిరూపించి ప్రపంచ రికార్డులు సృష్టిస్తూ ఉంటారు అని చెప్పాలి. కొంతమంది అయితే ఇలా వరల్డ్ రికార్డుల కోసం ఏకంగా ప్రాణాలను పణంగా పెట్టిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. ఇటీవల కాలంలో కొంతమంది మాత్రం ఏకంగా రోజు చేసే పనులనే కాస్త కొత్తగా ట్రై చేసి గిన్నిస్ బుక్ రికార్డులు కొడుతూ ఉండడం కూడా చూస్తూ ఉన్నాం. దీంతో ఇలాంటి పనులు చేస్తే కూడా వరల్డ్ రికార్డులు సాధించవచ్చు అని ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోతున్నారు.

 అయితే ఇప్పటివరకు పెరిగి పెద్దయి ఆలోచన శక్తి ఉన్నవారు రికార్డులు సాధించడం చూసాం. కానీ కేవలం ఐదు నెలల వయసు ఉన్న చిన్నారి వరల్డ్ రికార్డు కొట్టడం ఏమైనా చూశారా. ఐదు నెలల చిన్నారికి అసలు ఏం చేయడం సాధ్యమవుతుంది అంటారు ఎవరైనా. కానీ ఇక్కడ ఐదు నెలల చిన్నారి  తన జ్ఞాపకశక్తితో అందరిని అబ్బురపరుస్తుంది. కృష్ణా జిల్లాకు చెందిన నితిన్, తనుజాల కూతురు జైత్రీ ఇటీవల వరల్డ్ రికార్డు సృష్టించింది. పుట్టిన కొన్ని రోజులకే పాపలో జ్ఞాపకశక్తిని పేరెంట్స్ గుర్తించారు. ఇక మొక్కలను చూపిస్తూ పేర్లను చెప్పేవారు. కొన్ని రోజులకు పాప 100 మొక్కల్లో ఏ పేరు చెప్పినా ఫ్లాష్ కార్డ్ ఆల్బమ్ లో గుర్తిస్తుంది. దీంతో నోబెల్ వరల్డ్ రికార్డు సంస్థ పాప ప్రతిభను గుర్తించి సర్టిఫికెట్ ఇచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: