గ్యాస్ సిలిండర్ డెలివరీ చేసేవాడు.. కానీ కోటీశ్వరుడయ్యాడు?

praveen
కాలం కలిసి రావాలే కానీ ఏకంగా అదృష్ట లక్ష్మి ఎలాగైనా తడుపు తడుతుంది అని అంటూ ఉంటారు పెద్దలు. అయితే ఇక వెలుగులోకి వచ్చే కొన్ని కొన్ని ఘటనలు చూసిన తర్వాత ఇది నిజమే అనే భావన ప్రతి ఒక్కరికి కూడా కలుగుతూ ఉంటుంది అని చెప్పాలి. ఎందుకంటే అప్పటి వరకు కడు పేదరికంలో కనీస మూడు పూటలా తినడానికి తిండి కూడా లేని పరిస్థితుల్లో ఉన్న కొంతమంది ఇక ఒక్క రాత్రిలో ఏకంగా కోటీశ్వరులు గా మారిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి అని చెప్పాలి.

 ఏకంగా ఊహించని రీతిలో అదృష్ట లక్ష్మి తలుపు తట్టి చివరికి జీవితాన్ని మొత్తం మార్చేస్తూ ఉంటుంది. అయితే ఇలా అదృష్టం కలిసి రావాలి అంటే ఏం జరగాలో మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇంకేముంది లాటరీ రూపంలో డబ్బులు రావాలి లేదంటే ఏదైనా గేమ్ షోలో భారీ అమౌంట్ గెలిస్తేనే ఇలా ఓవర్ నైట్ లో కోటీశ్వరుడు గా మారెందుకు అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ ఒక వ్యక్తి గ్యాస్ సిలిండర్లు డెలివరీ చేస్తూ వచ్చిన డబ్బులతో జీవనం సాగిస్తూ ఉన్నాడు. అతని కుటుంబం కడు పేదరికంలోనే బ్రతుకుతుంది అయితే ఇక అతని బాధలు చూసి దేవునికి జాలిసిందో ఏమో గాని అతనికి ఊహించని రీతిలో అదృష్టం వరించింది.

 క్రికెట్ ఫాంటసీ గేమ్ డ్రీం లెవెన్ లో ఏకంగా కోటి రూపాయలు గెలుచుకున్నాడు. బీహార్ రాష్ట్రంలోని ఆర్ఆర్ఏ జిల్లా సదరన్ మండలం పటేగన గ్రామానికి చెందిన సాదిక్ అనే యువకుడు ఇలా డ్రీం లెవెల్లో గేమ్ ఆడి ఏకంగా కోటిన్నర రూపాయలు గెలుచుకున్నాడు. అతను స్థానికంగా ఉన్న ఉమా రాజ్ గ్యాస్ ఏజెన్సీలో  పనిచేస్తున్నాడు. క్రికెట్ పై ఆసక్తితో అతను తరచూ డ్రీం లెవెన్ లో బెట్టింగ్ పెట్టేవాడు  జనవరి 14న జరిగిన భారత్ ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్లో 49 రూపాయలతో గేమ్ ఆడాడు. 974.15 పాయింట్లతో తొలి స్థానంలో నిలిచి ఏకంగా కోటిన్నర గెలుచుకున్నాడు.

 దీంతో అతని కుటుంబం మొత్తం ఆనందంలో మునిగిపోయింది అని చెప్పాలి. కుటుంబ సభ్యులందరూ కూడా సంతోషం వ్యక్తం చేశారు. అయితే ఇదే విషయంపై సాదిక్ మాట్లాడుతూ మకర సంక్రాంతి సందర్భంగా భారత్,ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్లో 49 రూపాయలతో గేమ్ ఆడాను. మిలియనీర్ కావాలనే నా కల కొన్ని గంటల్లోనే నెరవేరింది అంటూ ఆనందం వ్యక్తం చేసాడు.  సాదిక్ అప్పుడప్పుడు చిన్న మొత్తాలను గెలుచుకునేవాడు. కానీ ఈసారి మాత్రం ఏకంగా కోటిన్నర గెలవడంతో ఎగిరిగంతేసాడు. అయితే ముందుగా ఈ విషయం చెబితే ఎవరూ నమ్మలేదు. పుకారు అని కొట్టిపారేసారూ.  కానీ అతని ఖాతాలోకి డబ్బు వచ్చేసరికి అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: