టాప్ లో ఉన్న శేఖర్ మాస్టర్.. ఒక్క సినిమాకు ఎంత తీసుకుంటాడో తెలుసా?

praveen
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ కొరియోగ్రాఫర్ గా కొనసాగుతూ వున్నాడు శేఖర్ మాస్టర్. ఒకప్పుడు డాన్సర్ గా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న శేఖర్ మాస్టర్.. ఇక ఇప్పుడు చేతినిండా సంపాదిస్తూ ఉన్నాడు అని చెప్పాలి. ఈయనతో కలిసి పని చేయడానికి స్టార్ హీరోలు సైతం తెగ ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. డాన్స్ అంటే ఎడమొహం పెట్టే హీరోలను సైతం అదరగొట్టే స్టెప్పులు చేయించడంలో శేఖర్ మాస్టర్ దిట్టా అని చెప్పాలి.

 ఈ విషయాన్ని మొన్న కూర్చి మర్త పెట్టి అనే సాంగ్లో అందరూ చూసే ఉంటారు. ఎందుకంటే డాన్స్ అంటే ఆమడ దూరం ఉండే మహేష్ బాబుతో అదిరిపోయే స్టెప్పులు వేయించాడు. ఇక ఆయన చేసిన డాన్స్ పెర్ఫార్మెన్స్ సోషల్ మీడియాలో ఎంత ట్రెండ్ అవుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక శేఖర్ మాస్టర్ డాన్స్ కంపోస్ చేశాడు అంటే చాలు అందులో ఏదో ఒక సిగ్నేచర్ స్టెప్పు ఉంటుంది అని అందరూ అనుకుంటూ ఉంటారు అని చెప్పాలి. ఇలా టాలీవుడ్ నుంచి కోలీవుడ్ వరకు అందరూ స్టార్ హీరోలకు ఆయనే కొరియోగ్రాఫర్ గా పని చేస్తున్నాడు.

 అయితే ఇలా టాప్ కొరియోగ్రాఫర్ గా కొనసాగుతున్న శేఖర్ మాస్టర్ ఒక్క సాంగ్ ఎంత తీసుకుంటారు అన్నది హాట్ టాపిక్ గా మారింది. దాదాపు ఒక్క సాంగ్ కంపోస్ చేయడానికి 50 లక్షల  నుండి కోటి రూపాయల వరకు వసూలు చేస్తాడట. ఓకే సినిమాలో రెండు మూడు పాటలు కంపోస్ చేస్తే దాదాపు రెండు కోట్లకు పైగానే పారితోషకం అందుతుందట. అయితే  శేఖర్ మాస్టర్ సినీ సెలబ్రిటీల సంగీత్ లను కూడా వదలడం లేదట. ఇలా సంగీత్ లకు కొరియోగ్రఫీ చేయడానికి 30 నుంచి 40 లక్షల రూపాయల వరకు తీసుకుంటాడట శేఖర్ మాస్టర్. అయితే సంగీత్ లకు శేఖర్ మాస్టర్ కంటే ఆయన శిష్యులు ఎక్కువగా వర్క్ చేస్తారు అన్న టాక్ కూడా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: