సెంచరీతో.. రోహిత్ ప్రపంచ రికార్డ్?

praveen
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. గత ఏడాది ఇండియా వేదికగా జరిగిన వరల్డ్ కప్ టోర్నీలో రోహిత్ తన బ్యాటింగ్ విధ్వంసంతో ఎంతలా బౌలర్లకు వణుకు పుట్టించాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందరిలాగా సెంచరీలు చేయకపోయినప్పటికీ ఇక ఓపెనర్ గా బరిలోకి దిగుతూ ఏకంగా సిక్సర్లు ఫోర్లతో రోహిత్ శర్మ చెలరేగిపోయిన విధానం మాత్రం ప్రేక్షకులందరిని కూడా ఫిదా చేసింది.. భారత జట్టుకు ఎలాంటి ఆరంభం అయితే కావాలో అలాంటి ఆరంభాలను ఇచ్చి వరుసగా మ్యాచ్లలో విజయం సాధించడంలో కీలక పాత్ర వహించాడు కెప్టెన్ రోహిత్ శర్మ.

 అయితే ఇక 2024లో జూన్ నెలలో అటు టి20 వరల్డ్ కప్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో.. దాదాపు 14 నెలల తర్వాత పొట్టి ఫార్మట్ లో అడుగుపెట్టాడు. ఈ క్రమంలోనే రోహిత్ శర్మ ప్రదర్శన ఎలా ఉంటుంది అనే విషయం పైన అందరి దృష్టి ఉంది. అయితే అందరినీ నిరాశ పరుస్తూ వరుసగా రెండు మ్యాచ్లలో డక్ ఔట్ గా వెనుతిరిగాడు రోహిత్ శర్మ. దీంతో మూడో మ్యాచ్లో కూడా రోహిత్ రాణిస్తాడు అని పెద్దగా ఎవరు నమ్మకం పెట్టుకోలేదు. కానీ మూడో టి20 మ్యాచ్ లో మాత్రం వీర విహారం చేశాడు. సూపర్ సెంచరీ తో చెలరేగిపోయాడు హిట్ మాన్.

 ఈ క్రమంలోనే రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు అని చెప్పాలి. అంతర్జాతీయ టి20లలో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్గా రోహిత్ శర్మ అవతరించాడు. ఇప్పటివరకు రోహిత్ టి20 ఫార్మాట్ లో ఐదు సెంచరీలు చేశాడు అని చెప్పాలి. కాగా రోహిత్ తర్వాతి స్థానంలో సూర్య కుమార్ యాదవ్ నాలుగు సెంచరీలతో ఉండగా మాక్స్వెల్ నాలుగు సెంచరీలతో ఇక వరుసగా రెండు మూడు స్థానాలలో ఉన్నారు. అలాగే t20 ఫార్మాట్లో అత్యధిక పరుగులు చేసిన భారత కెప్టెన్ గా కూడా హిట్ మాన్ రికార్డ్ సృష్టించాడు. ఏకంగా 1572 పరుగులు చేశాడు రోహిత్. కోహ్లీ 1570 పేరట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: