GT ని వీడిన హార్దిక్.. షమి షాకింగ్ కామెంట్స్?

praveen
ఇండియన్ ప్రీమియర్ లీగ్ హిస్టరీలో ఛాంపియన్ టీం గా కొనసాగుతున్న ముంబై ఇండియన్స్ జట్టులో ఇటీవల ఎవరు ఊహించని మార్పు జరిగింది. ఏకంగా జట్టును ఐదుసార్లు ఐపీఎల్ టైటిల్ విజేతగా నిలిపిన రోహిత్ శర్మను సారధ్య  బాధ్యతల నుంచి ఆ ఫ్రాంచైజీ తప్పించింది. ఈ క్రమంలోనే ఈ నిర్ణయంతో షాక్ లో మునిగిపోయారు భారత క్రికెట్ ప్రేక్షకులు. ఇక రోహిత్ అభిమానులు ఇక అతన్ని జట్టు కెప్టెన్సీ నుంచి తప్పించడాన్ని అస్సలు జీర్ణించుకోలేకపోయారు అన్న విషయం తెలిసిందే.

 అదే ముంబై ఇండియన్స్ వదిలేయడంతో గుజరాత్ జట్టులోకి వెళ్లి అక్కడ సారధ్య బాధితులు చేపట్టిన హార్థిక్ పాండ్యా ఇక మొదటి ప్రయత్నంలోనే జట్టును టైటిల్ విజేతగా నిలిపాడు. ఇక ఆ తర్వాత సీజన్లో ఏకంగా గుజరాత్ జట్టును రన్నరప్గా నిలిపాడు అన్న విషయం తెలిసిందే. దీంతో అతని కెప్టెన్సీ నైపుణ్యానికి చూసి అందరూ ఫిదా అయిపోయారు. ఇక అతనే రోహిత్ తర్వాత ఫ్యూచర్ కెప్టెన్ అంటూ అందరూ నమ్మటం మొదలుపెట్టారు. ఇలాంటి సమయంలో ఇక గుజరాత్ జట్టు నుంచి ముంబైలోకి హార్దిక్ ను మళ్ళీ తిరిగి తెచ్చుకున్న జట్టు యాజమాన్యం అతన్ని చేతిలో కెప్టెన్సీ కూడా పెట్టేసింది.

 అయితే ఈ కెప్టెన్సీ మార్పు విషయంపై ఎంతోమంది మాజీ ప్లేయర్లు ఇప్పటివరకు స్పందించారూ. ఇదే విషయంపై గుజరాత్ జట్టులో ప్లేయర్గా కొనసాగుతున్న భారత సీనియర్ బౌలర్ మహమ్మద్ షమి స్పందించాడు   జట్టు నుంచి ఎవరు వెళ్ళిపోతున్నారు అన్నది ముఖ్యం కాదు టీం బ్యాలెన్స్డ్ గా ఉందా లేదా అన్నది మాత్రమే ముఖ్యం. హార్దిక్ పాండ్యా గుజరాత్ ని రెండుసార్లు ఫైనల్ కు తీసుకువెళ్లాడు. 2022లో జట్టును కెప్టెన్గా నిలపాడు   అయితే జట్టును వదిలేయడం అతని వ్యక్తిగత నిర్ణయం. ఇక ఇప్పుడు గిల్ కెప్టెన్ అయ్యాడు అనుభవం పొందిన తర్వాత ఏదో ఒక  రోజు అతను కూడా వెళ్లిపోవచ్చు అంటూ మహమ్మద్ షమీ షాపింగ్ కామెంట్స్ చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: