కొట్టింది 29 పరుగులే అయినా.. చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ?

praveen
టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ గురించి భారత క్రికెట్ ప్రేక్షకులకే కాదు ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులకు కూడా కొత్తగా పరిచయం అవసరం లేదు. ఎందుకంటే తన ఆట తీరుతో అందరికీ సుపరిచితుడిగా మారిపోయాడు విరాట్ కోహ్లీ. సాధారణంగా ప్రతి రంగంలో ప్రతి తరానికి రోల్ మోడల్గా నిలిచే ఆటగాడు ఒకరు వస్తూ ఉంటారు అని చెబుతూ ఉంటారు ఎంతో మంది విశ్లేషకులు. అయితే క్రికెట్ కి ఈ తరానికి రోల్ మోడల్ గా నిలిచిపోయేది విరాట్ కోహ్లీ అనడంలో ఎలాంటి సందేహం లేదు..

 ఏకంగా రికార్డులు సాధించడం విషయంలో మాత్రమే కాదు సోషల్ మీడియాలో ఫాలోవర్ల విషయంలో కూడా విరాట్ కోహ్లీ ఎవరికి అందనంత ఎత్తులో ఉన్నాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే కోహ్లీ ఆట తీరుతో ఇక ప్రతి ఒక్క క్రికెట్ ప్రేక్షకుడి హృదయానికి దగ్గరయ్యాడు. ఇక ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు అందరితో కూడా రికార్డుల రారాజు అని పిలిపించుకుంటూ ఉన్నాడు విరాట్ కోహ్లీ. రికార్డులు కొల్లగొట్టినప్పటికీ ఇంకా దాహం తీరలేదు అన్నట్టుగానే రికార్డుల వేట కొనసాగిస్తూ ఉంటాడు. ఇక ఇటీవలే మరో ప్రపంచ  రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు విరాట్ కోహ్లీ.

 అంతర్జాతీయ క్రికెట్లో చరిత్ర సృష్టించాడు అని చెప్పాలి. ఇటువంటి ఫార్మాట్లో  ఛేజింగ్ లో 2000 ప్లస్ పరుగులు చేసిన తొలి ఆటగాడిగా ఘనత సాధించాడు విరాట్ కోహ్లీ. ఇటీవల ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన రెండో టి20 మ్యాచ్ లో టీమిండియా చేజింగ్ చేసింది అన్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో 29 పరుగులు చేశాడు. దీంతో ఈ ఘనతను అందుకున్నాడు. చేజింగ్లో విరాట్ కోహ్లీ 46 t20 మ్యాచ్ లలో 2012 పరుగులు చేశాడు. 152 వన్డే మ్యాచ్లలో 7794 పరుగులు, 74 టెస్టుల్లో సెకండ్ ఫోర్త్ ఇన్నింగ్స్ లు కలుపుకొని 4096 పరుగులు చేశాడు కోహ్లీ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: