రోహిత్ భాయ్.. ఇలా అయితే మనం కప్ గెలిచినట్టే?

praveen
టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ విషయంలో ప్రస్తుతం అభిమానులు అందరిలో కూడా ఆందోళన మొదలైంది. ఇక రోహిత్ ఇలాగే ఉంటే టి20 వరల్డ్ కప్ లో భారత్ జట్టుకు టైటిల్ అందించడం కష్టమే అని ఏకంగా అభిమానులు సైతం అనుకుంటున్నారు. దీనికి కారణం కూడా లేకపోలేదు. దాదాపు 14 నెలల గ్యాప్ తర్వాత టీమ్ ఇండియా కెప్టెన్ గా రోహిత్ శర్మ మళ్ళీ పొట్టి ఫార్మాట్లోకి రీఎంట్రీ ఇచ్చాడు. ఇక రోహిత్తో పాటు కోహ్లీ కూడా పొట్టి ఫార్మాట్లో అడుగుపెట్టాడు అన్న విషయం తెలిసిందే. అయితే ఇక రోహిత్ ఇంత గ్యాప్ తర్వాత వస్తూ ఉండడంతో అతని ప్రదర్శన పై భారీ రేంజ్ లోనే అంచనాలు పెట్టుకున్నారు అభిమానులు.

 ఈ క్రమంలోనే మొహాలీ వేదికగా మొదటి టి20 మ్యాచ్ జరిగింది అన్న విషయం తెలిసిందే. కాగా ఆఫ్ఘనిస్తాన్ ఇండియా మధ్య జరిగిన మొదటి టి20 మ్యాచ్ లో గిల్ కారణంగా రోహిత్ శర్మ ఊహించనీ రీతిలో రన్ అవుట్ అయ్యాడు. దీంతో పరుగుల ఖాతా తెరవకుండానే డక్ అవుట్ రూపంలో పెవిలియన్ చేరాడు అన్న విషయం తెలిసిందే. దీంతో రోహిత్ ఫ్యాన్స్ గిల్ ను తిట్టుకున్నారు. రోహిత్ క్రీజులో  ఉండి ఉంటే బ్యాటింగ్ విధ్వంసం సృష్టించేవాడని.. గిల్ కారణంగా అద్భుతంగా రాణించాల్సిన రోహిత్ దురదృష్టవశాత్తు వికెట్ కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది అంటూ విమర్శలు చేశారు.

 అయితే ఇక రెండో టి20 మ్యాచ్ లో మాత్రం రోహిత్ అదరగొడతాడు అనుకుంటుండగా.. మరోసారి పరుగుల ఖాతా తెరవకుండానే మొదటి బంతికే క్లీన్ బౌల్డ్ అయ్యాడు. మళ్ళీ డక్ అవుట్ గా వెను తిరిగాడు. దీంతో రోహిత్ ఆట తీరు చూసి అభిమానులు షాక్ లో మునిగిపోయారు. గత ఏడాది జరిగిన వరల్డ్కప్ లో అదరగొట్టిన రోహిత్ ఇప్పుడు ఇలా విఫలమవుతున్నాడేంటి అని ఆశ్చర్యపోతున్నారు. ఇలాంటి ఆట తీరుతో ఇక రోహిత్ శర్మ వరల్డ్ కప్ ఆడితే.. కప్పు గెలవడం  కష్టమే అంటూ అభిప్రాయపడుతున్నారు అభిమానులు. ఇక మూడో టి20 లో అయినా రోహిత్ రాణిస్తాడో లేదో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: