ఇజ్రాయిల్ కు అనుకూలంగా మాట్లాడాడు.. కానీ ఇలా జరుగుతుందని ఊహించలేదు?

praveen
సాధారణం గా సెలబ్రిటీలుగా కొనసాగుతున్న వారు ఏం చేసినా కూడా ముందు వెనుక అన్ని ఆలోచించి చేయాల్సి ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే ఇక సెలబ్రెటీలు ఏం చేసినా కూడా అది సోషల్ మీడియా లో సెన్సేషన్ గా మారి పోతూ ఉంటుంది. కోట్లాది మంది జనాలను ప్రభావితం చేస్తూ ఉంటుంది. ఎందుకంటే సోషల్ మీడియా లో అటు సెలబ్రిటీలకు ఉండే క్రేజ్ దృశ్య ఇక వారిని ఎప్పటికీ మీడియా ఒక కంట కని పెడుతూనే ఉంటుంది.

 అందుకే ఇలా సెలబ్రిటీలకు సంబంధించిన ఎన్నో విషయాలు ఎప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారి పోతూనే ఉంటాయి. అయితే సినీ రాజకీయ క్రీడ రంగాలకు చెందిన ప్రముఖులందరూ కూడా ఏం మాట్లాడాలన్నా ఏం చేయాలన్నా ఎక్కడికి వెళ్లాలన్నా అది చేస్తే తర్వాత ఏం జరుగుతుంది అన్న విషయాన్ని ముందుగానే ఆలోచించి ముందు జాగ్రత్త పడాల్సి ఉంటుంది. ఎప్పుడైనా ఇక ఇలా ఎవరైనా సెలబ్రిటీలు నోరు జారారు అంటే ఇక ఆ తర్వాత చివరికి బాధపడాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది.

 అయితే ఇటీవల సౌత్ ఆఫ్రికా అండర్ 19 వరల్డ్ కప్ జట్టు కెప్టెన్ గా ఉన్న ఒక క్రికెటర్ కి ఇలాంటి చేదు అనుభవమే ఎదురయింది. ఈనెల 19 నుంచి సౌత్ ఆఫ్రికా వేదికగా అండర్ 19 వరల్డ్ కప్ జరగనుంది. ఇలాంటి సమయంలో కీలకమైన పరిణామం చోటుచేసుకుంది. ఇజ్రాయిల్ సైనికులకు అనుకూలంగా మాట్లాడిన డేవిడ్ టిగర్ ను కెప్టెన్సీ నుంచి సౌత్ ఆఫ్రికా క్రికెట్ బోర్డు తొలగించింది. టోర్నీలో పాలస్తీనా మద్దతుదారులు ఆందోళన చేసే అవకాశం ఉండడంతో ఇక ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. అయితే ఆస్ట్రేలియా ఆటగాడు కవాజా గతంలో ఇక పాలస్తీనాకు మద్దతుగా మాట్లాడటంతో అతన్ని ఐసీసీ హెచ్చరించింది అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: