భువి జోరు చూస్తే.. టీమిండియాలోకి వచ్చేలాగే ఉన్నాడు?

praveen
గత కొంతకాలం నుంచి భారతదేశంలో యువ ఆటగాళ్ల హవా పెరిగిపోయిన నేపథ్యంలో టీమిండియాలో సీనియర్ ప్లేయర్ల కెరియర్ ప్రమాదంలో పడిపోయింది అన్న విషయం తెలిసిందే. ఒకప్పుడు జట్టులో కీలక ప్లేయర్లుగా మూడు ఫార్మాట్లలో ఆటగాళ్లుగా కొనసాగిన వారు ఇక యువ ఆటగాళ్ల రాకతో పోటీ తట్టుకోలేక చివరికి జట్టులో స్థానాన్ని కోల్పోయిన వారు చాలామంది ఉన్నారు అని చెప్పాలి. ఇక ఇలాంటి వారిలో ఒకప్పుడు భారత బౌలింగ్ దళాన్ని బుమ్రాతో కలిసి ముందుకు నడిపించిన భూమనేశ్వర్ కుమార్ కూడా ఒకరు అని చెప్పాలి.

 ఒకప్పుడు తన స్వింగ్ బౌలింగ్ తో ఇక జట్టుకు ఎన్నోసార్లు కష్టాల నుంచి బయటపడేసాడు. రెండు వైపులా స్వీంగ్ చేయడంలో అటు భువనేశ్వర్ కుమార్ దిట్ట అని చెప్పాలి. ఇక అతను భారత జట్టు తరుపున ఆడుతూ ఎన్నో సార్లు అద్భుతాలు చేసి చూపించాడు అని చెప్పాలి. బుమ్రా, భువి ద్వయం జట్టులో ఉంది అంటే చాలు ఇక ప్రత్యర్ధులు వనికి  పోయేవారు. బుమ్రా డెత్ ఓవర్లలో అద్భుతమైన బౌలింగ్ చేస్తే భువి పవర్ ప్లే లో బౌలింగ్ చేస్తూ.. ఇక పరుగులను కట్టడి చేసేవాడు. ఇక అలాంటి భువి గత కొంతకాలం నుంచి మాత్రం భారత జట్టుకు సెలెక్ట్ కావడం లేదు. ఇక పూర్తిగా సెలెక్టర్లు అతని పక్కన పెట్టేసారు.

 అయితే ఇక ఇప్పుడు రంజీల్లో అతని ప్రదర్శన చూస్తూ ఉంటే మరికొన్ని రోజుల్లో భారత జట్టులోకి వచ్చే ఛాన్స్ లే ఎక్కువగా ఉన్నాయి అని చెప్పాలి. ఇటీవల రంజీల్లో భాగంగా పశ్చిమ బెంగాల్ తో జరిగిన మ్యాచ్లో యూపీ తరఫున బరిలోకి దిగిన భువనేశ్వర్ ఏకంగా రెండు ఇన్నింగ్స్ లలో కలిపి ఎనిమిది వికెట్లు పడగొట్టాడు. తన ఇన్, ఔట్ సింగర్ బంతులతో బ్యాట్స్మెన్ లకు చెమటలు పట్టించాడు. అయితే ఈ మ్యాచ్ లో భువి 22 ఓవర్లు వేయగా.. అందులో ఏకంగా 5 మెయిడిన్ ఓవర్లు ఉండడం గమనార్హం. ఇక భువి ఫామ్ చూస్తే త్వరలోనే అటు భారత జట్టులోకి కూడా సెలెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని.. క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: