సంజును పక్కన పెట్టడానికి.. అసలు కారణం అదే : రోహిత్

praveen
టీమిండియాలో టాలెంటెడ్ క్రికెటర్ గా కొనసాగుతూ ఉన్నాడు సంజూ శాంసన్. అయితే ఇతనికి ఎందుకో తగినన్ని అవకాశాలు మాత్రం రావడం లేదు అని చెప్పాలి. ఇక మొన్నటికి మొన్న ఎంట్రీ ఇచ్చిన ఆటగాళ్లు తరచూ జట్టులో చోటు సంపాదించుకుంటూ ఉంటే.. ఎప్పుడో చాలా ఏళ్ల కింద భారత జాతీయ జట్టులోకి వచ్చిన సంజూ శాంసన్ కు మాత్రం అతి తక్కువ అవకాశాలు దక్కాయి అని చెప్పాలి. ఈ క్రమంలోనే సెలెక్టర్లు అతనిపై వివక్ష చూపిస్తున్నారు అంటూ ఎంతో మంది సంజు అభిమానులు గతంలో నిరసనలు చేయడం కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది అన్న విషయం తెలిసిందే.

 అయితే మొన్నటికి మొన్న సౌతాఫ్రికా పర్యటనలో భాగంగా వన్డే మ్యాచ్లో సెంచరీ చేసి అదరగొట్టాడు సంజూ. దీంతో ఇక టీమిడియాలో అతని స్థానం సుస్థిరం అయినట్టే అనే అభిమానులు అనుకున్నారు. అయితే ఇటీవలే ఆఫ్ఘనిస్తాన్తో జరిగే టి20 సిరీస్ కోసం కూడా ఎంపికయ్యాడు. కానీ ఇక ఎప్పటి లాగానే మళ్లీ బెంచ్ కి పరిమితమయ్యాడు. కాగా ఇటీవల జరిగిన మొదటి టి20 మ్యాచ్ లో అతనికి తుది జట్టులో చోటు దక్కలేదు అని చెప్పాలి. దీంతో సంజు అభిమానులందరికీ కూడా మరోసారి నిరాశ ఎదురయింది.

 అయితే మొదటి టి20 మ్యాచ్ లో తుది జట్టులోకి సంజూ శాంసన్ ను తీసుకోకపోవడానికి గల కారణాన్ని చెప్పుకొచ్చాడు కెప్టెన్ రోహిత్ శర్మ. టీం కాంబినేషన్లో భాగంగానే సంజు శాంసన్, ఆవిష్ ఖాన్, యశశ్వి జైష్వాల్, కుల్దీప్ యాదవ్ లను పక్కన పెట్టాల్సి వచ్చింది అంటూ చెప్పుకొచ్చాడు. కాగా 2024 t20 వరల్డ్ కప్ కి ముందు భారత జట్టు ఆడే ఏకైక టీ20 సిరీస్ ఇదే కావడం గమనార్హం. ఇక ఇప్పుడు శాంసన్ ను పక్కన పెట్టారు అంటే.. టి20 వరల్డ్ కప్ లో కూడా చోటు దక్కుతుందా లేదా అనే విషయంపై అనుమానాలు నెలకొంటాయి. మిగతా రెండు మ్యాచ్లలో అయినా అతనికి అవకాశాలు ఇస్తారో లేదో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: