టి20లలో మరో 23 పరుగులు చేస్తే చాలు.. రోహిత్ చరిత్ర సృష్టిస్తాడు?

praveen
భారత జట్టు ప్రస్తుతం వరుసగా ద్వైపాక్షిక సిరీస్ లతో బిజీబిజీగా ఉంది అన్న విషయం తెలిసిందే. ఇటీవల సౌత్ ఆఫ్రికా పర్యటనను ముగించుకుంది టీం ఇండియా. ఇక ఇప్పుడు ఏకంగా భారత పర్యటనకు వచ్చిన ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో మూడు మ్యాచ్ ల టి20 సిరీస్ ఆడుతూ ఉంది అని చెప్పాలి. అయితే ఇక ఆఫ్ఘనిస్తాన్ తో జరగబోయే టి20 సిరీస్ భారత అభిమానులందరికీ కూడా ఎంతో స్పెషల్ గా మారబోతుంది అని చెప్పాలి. ఎందుకంటే 2022 t20 వరల్డ్ కప్ సమయంలో పొట్టి ఫార్మాట్లో మ్యాచ్లు ఆడిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు దాదాపు 14 నెలల విరామం తర్వాత మళ్లీ టి20లు ఆడబోతున్నారు.

 ఆఫ్ఘనిస్తాన్ తో టి20 సిరీస్ లో ఈ సీనియర్ క్రికెటర్లు ఇద్దరూ కూడా భాగం అయ్యారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇన్ని నెలల గ్యాప్ తర్వాత ఈ ఇద్దరు సీనియర్లు ఎలా పొట్టి ఫార్మట్ లో ఎలా రానించబోతున్నారు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. ఇదిలా ఉంటే ఏకంగా ప్రస్తుతం టి20 ఫార్మాట్లో కెప్టెన్ రోహిత్ శర్మ ఆడబోతున్న నేపథ్యంలో ఏకంగా చరిత్ర సృష్టించేందుకు కొద్ది దూరంలోనే ఉన్నాడు అని వార్త వైరల్ గా మారిపోయింది. ఆఫ్ఘనిస్తాన్తో జరగబోయే టి20 సిరీస్ లో రోహిత్ శర్మ 23 పరుగులు చేశాడు అంటే చాలు ఇక అరుదైన రికార్డును ఖాతాలో వేసుకోబోతున్నాడు.

 మరో 23 పరుగులు చేస్తే టి20 ఫార్మాట్లో అత్యధిక పరుగులు సాధించిన భారత కెప్టెన్ గా రోహిత్ శర్మ అరుదైన రికార్డును సృష్టిస్తాడు అని చెప్పాలి. ఇక ఈ రికార్డు ప్రస్తుతం విరాట్ కోహ్లీ పేరిట ఉంది. ఎందుకంటే విరాట్ కోహ్లీ కెప్టెన్ గా ఉన్న సమయంలో 50 మ్యాచ్లలో 1570 పరుగులు చేశాడు. రోహిత్ శర్మ కెప్టెన్ గా ఇప్పటివరకు 51 మ్యాచ్లలో 1552 పరుగులు చేశాడు. ఈ జాబితాలో ధోని మూడో స్థానంలో ఉన్నాడు. కెప్టెన్గా ధోని టి20 ఫార్మాట్లో 1112 పరుగులు చేశాడు. అయితే రోహిత్ శర్మ మరో 23 పరుగులు చేశాడు అంటే ఇక విరాట్ కోహ్లీ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొడతాడు అని చెప్పాలి. ఇక రోహిత్ ప్రస్తుతం మంచి ఫామ్ మీద ఉండడంతో ఎంతో అలవోకగా ఈ రికార్డు సాధించడం ఖాయమని అభిమానులు కూడా అనుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: