WPL ఫై క్రేజీ అప్డేట్.. మ్యాచ్ లు అక్కడ కూడా జరుగుతాయట?

praveen
బీసీసీఐ ప్రతి ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ ను నిర్వహిస్తూ ఉంటుంది. ఇక ఒక సాదాసీదా టీ20 లీగ్ గా ప్రారంభమైన ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రపంచ క్రికెట్లో ప్రత్యేకమైన స్థానాన్ని సొంతం చేసుకుంది అన్న విషయం తెలిసిందే. అంతేకాకుండా వరల్డ్ క్రికెట్లో రిచేస్ట్ క్రికెట్ లీగ్ గా కూడా కొనసాగుతుంది  ఐపీఎల్. ఇక ఐపీఎల్ ద్వారా ఎంతో మంది యువ ఆటగాళ్లు కూడా తమ ప్రతిభను నిరూపించుకొని అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెడుతూ ఉండడం కూడా చూస్తూ ఉన్నాం.

 అయితే ఐపీఎల్ అందరికీ కొత్త జీవితాన్ని ప్రసాదించడమే కాదు కష్టాలు కడలిలో క్రికెట్ ప్రాణంగా బతుకుతున్న ఎంతోమంది యువ ఆటగాళ్ల కు ఆర్థిక భరోసా కూడా ఇస్తూ ఉంది. ఇక అన్ క్యాప్డ్ ప్లేయర్లు సైతం కోట్ల రూపాయల ధర పలుకుతున్నారు అని చెప్పాలి. అయితే బీసీసీఐ ఎలా అయితే ఐపిఎల్ నిర్వహిస్తుందో అదే తరహాలో అటు మహిళా క్రికెట్ ను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ కూడా నిర్వహిస్తుంది. గతి ఏడాది నిర్వహించిన ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ సూపర్ సక్సెస్ అయింది  ఇక మొదటి సీజన్లో ముంబై ఇండియన్స్ టీం టైటిల్ విజేతగా నిలిచింది అన్న విషయం తెలిసిందే.

 ఇక ఇప్పుడు ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ రెండవ సీజన్ నిర్వహణపై అటు బీసీసీఐ దృష్టి సారించింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇటీవల ఇక ఈ మహిళల ప్రీమియర్ లీగ్ కి సంబంధించి వేలం ప్రక్రియ కూడా మొదలైంది. అయితే ఇక ఈ టోర్నని ఈ ఏడాది ఎన్ని వేదికలలో నిర్వహిస్తారు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది అని చెప్పాలి. కాగా ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ను ఈసారి రెండు నగరాలలో నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది. తొలి సీజన్ మొత్తం ముంబైలోనే జరిగింది. కానీ రెండవ సీజన్ ఢిల్లీ, బెంగళూరులో నిర్వహించనున్నట్లు తెలుస్తోంది  ఫిబ్రవరి చివరి వారంలో మ్యాచ్ ప్రారంభమయ్యే అవకాశం ఉందట.

మరింత సమాచారం తెలుసుకోండి:

Wpl

సంబంధిత వార్తలు: