వారెవ్వా.. ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్ కి.. అయ్యర్ భలే మాస్టర్ వేసాడుగా?

praveen
గత కొంతకాలం నుంచి కీలకమైన ఇన్నింగ్స్ లతో జట్టులో కీలక ప్లేయర్గా మారిపోయిన శ్రేయస్ అయ్యర్ ఇటీవల సౌతాఫ్రికా పర్యటనలో ఆతిథ్య సఫారీ జట్టుతో జరిగిన టెస్ట్ సిరీస్ లో మాత్రం ఎందుకో చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. ఈ క్రమంలోనే తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొన్నాడు అన్న విషయం తెలిసిందే. ఇక శ్రేయస్ అయ్యర్ కేవలం పరిమిత ఓవర్ల ఫార్మాట్ కి మాత్రమే సెట్ అవుతాడు అంటూ ఎంతో మంది విమర్శలు కూడా చేశారు.

 అయితే ఇక జనవరి 25వ తేదీ నుంచి ఇంగ్లాండ్ తో జరగబోయే టెస్ట్ సిరీస్ కోసం శ్రేయస్ అయ్యర్ ఇక బాగా రాణించేందుకు ప్రస్తుతం మాస్టర్ ప్లాన్ వేశాడు అన్నది తెలుస్తుంది. జనవరి 11వ తేదీ నుంచి ఆఫ్ఘనిస్తాన్తో జరగబోయే టి20 సిరీస్ కోసం ఇక సెలక్టర్లు శ్రేయస్ అయ్యర్ ఎంపిక చేయలేదు. అయితే అతనికి కాస్త కాలి సమయం దొరికింది అని చెప్పాలి. సమయాన్ని సుదీర్ఘమైన టెస్ట్ ఫార్మాట్ పై వెచ్చించేందుకు శ్రేయస్ అయ్యర్ సిద్ధమయ్యాడట. ఈ క్రమంలోనే ఇంగ్లాండ్తో జరగబోయే ఐదు టెస్ట్ మ్యాచ్ల సిరీస్ కోసం ప్రిపరేషన్ లో భాగంగా ఇప్పుడు దేశవాళీ క్రికెట్ ఆడేందుకు సిద్ధమయ్యాడు ఈ స్టార్ ప్లేయర్.

 ఏకంగా రంజీ ట్రోఫీలో ముంబై జట్టు తరుపున మ్యాచ్లు ఆడబోతున్నాడు అని చెప్పాలి. ఈ ప్రతిష్టాత్మకమైన దేశవాళి టోర్నీలో భాగంగా జనవరి 12వ తేదీ నుంచి 15వ తేదీ వరకు కూడా ఆంధ్ర తో మ్యాచ్ జరగబోతుంది. అయితే ఈ మ్యాచ్ లో శ్రేయస్ అయ్యర్ బరిలోకి దిగబోతున్నాడట  ఇంగ్లాండ్ ఏ జట్టుతో జరిగే అనధికారిక టెస్ట్ మ్యాచ్లో భారత ఏ జట్టు తరఫున ఆడేందుకు సర్ఫరాజ్ రాంజీల్లో ముంబై జట్టును వీడడంతో అతని స్థానంలో శ్రేయస్ అయ్యర్ ఇక జట్టులోకి వచ్చాడు అన్నది తెలుస్తోంది కథ సౌత్ ఆఫ్రికా తో జరిగిన టెస్ట్ సిరీస్లో 31, 6, 0, 4 లాంటి పరుగులతో నిరాశపరిచిన అతను ఇక ఇప్పుడు ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ లో మాత్రం సత్తా చాటాలని మాస్టర్ ప్లాన్ వేసినట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: