కేక్ టౌన్ పిచ్ పై ఐసీసీ రివ్యూ.. అందరి నోర్లు మూసుకుపోయాయి?

praveen
గత కొంతకాలం నుంచి ఇండియాలో ఉన్న పిచ్ లపై ఇతర దేశాలకు చెందిన ఆటగాళ్లందరూ కూడా తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు అన్న విషయం తెలిసిందే. భారత జట్టు తమకు అనుకూలంగా పిచ్ లను తయారు చేసుకుంటుందని.. ఇక భారత్లోని పిచ్ లలో ఎలాంటి నాణ్యత ఉండదు అంటూ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఇక ఇలాంటి విమర్శలను అటు భారత మాజీ ఆటగాళ్లు కూడా తిప్పి కొట్టారు అని చెప్పాలి. ఇదే విషయంపై గత కొంతకాలం నుంచి చర్చ జరుగుతుంది. అయితే ఇటీవల భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య రెండవ టెస్ట్ మ్యాచ్ కేప్ టౌన్  వేదికగా జరగగా.. ఈ పిచ్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. ఎందుకంటే నాలుగు రోజుల పాటు సాగాల్సిన ఆట కేవలం ఒకటిన్నర రోజులోనే ముగిసింది.

 బ్యాట్స్మెన్లు ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇక ఈ పిచ్ నీ టార్గెట్ చేస్తూ మమ్మల్ని అనడమే కాదు ముందు మీది మీరు చూసుకోండి అన్నట్లుగా అటు భారత మాజీ ఆటగాళ్లు కూడా కౌంటర్లు ఇచ్చారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇక ఇటీవల సౌత్ ఆఫ్రికా, ఇండియా మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ జరిగిన కేప్ టౌన్ పిచ్ పై అటు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏకంగా ఒక పాయింట్ కోత విధిస్తూ నిర్ణయం తీసుకుంది ఐసీసీ. కేప్ టౌన్ పిచ్  ప్రమాదకరంగా ఉన్న కారణంగా సంతృప్తికరంగా లేదు అంటూ రేటింగ్ ఇచ్చింది.

 అయితే ఇటీవలే సౌత్ ఆఫ్రికా ఇండియా మధ్య జరిగిన మ్యాచ్ ఒకటిన్నర రోజులోనే ముగియడమే కాదు.. ఏకంగా బౌలర్లు ఈ టెస్ట్ మ్యాచ్ లో 33 వికెట్లు పడగొట్టారు అని చెప్పాలి. ఇటీవల ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొన్ని పిచ్ లపై ఐసీసీ ఒక ప్రకటన విడుదల చేసింది. కేప్ టౌన్  లోని పిచ్ బ్యాటింగ్ చాలా కష్టంగా ఉంది. బంతివేగంగా వచ్చి కొన్ని సార్లు ప్రమాదకరంగా మారిపోయింది. అందుకే ఈ పిచ్ ని సంతృప్తికరంగా లేని పిచ్ గా తేల్చినట్లు ఐసిసి ప్రకటించింది. ఇక ఐసీసీ కేప్ టౌన్ పిచ్ పై ఇచ్చిన రివ్యూ సౌత్ ఆఫ్రికా క్రికెట్ బోర్డుకి గతంలో అటు భారత పిచ్ లపై విమర్శలు చేసిన వారికి చెంపపెట్టులా మారింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: