హార్దిక్ తర్వాత.. టీమిండియా ఫ్యూచర్ కెప్టెన్ అతనేనా?

praveen
గత కొంతకాలం నుంచి భారత క్రికెట్లో కెప్టెన్సీ మార్పు విషయం గురించి తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతుంది. ఎందుకంటే ప్రస్తుతం మూడు ఫార్మాట్లకు కూడా రెగ్యులర్ కెప్టెన్ గా కొనసాగుతున్నాడు రోహిత్ శర్మ. అయితే మూడు ఫార్మాట్లకు కెప్టెన్ అనే మాటే కానీ టి20 ఫార్మాట్కు మాత్రం రోహిత్ అందుబాటులో ఉండడం లేదు. 2022 t20 వరల్డ్ కప్ లో తర్వాత అతను మళ్లీ పొట్టి ఫార్మాట్ లో ఒక్క మ్యాచ్ కూడా ఆటలేదు. దీంతో హార్దిక్ పాండ్యాను తాత్కాలిక కెప్టెన్ గా నియమించి అటు భారత జట్టుతో టీ20 సిరీస్ ఆడిస్తోంది బీసీసీఐ.

 అయితే  త్వరలోనే హార్దిక్ పాండ్యాకు ఇక పూర్తిస్థాయి సారధ్య బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది అని తెలుస్తుంది. అయితే భారత జట్టులో ఉన్న మిగతా ప్లేయర్లు కూడా దాదాపు హార్దిక్ పాండ్యాతో సమానమైన వయసు కలిగిన వారె కావడం గమనార్హం. అయితే ఇక హార్థిక్ పాండ్యాకు డిప్యూటీ తో పాటు ఇక ఫ్యూచర్ కెప్టెన్ ను ఇప్పటినుంచి రెడీ చేయాలి అని ఆలోచనలో బీసీసీఐ ఉందట. ఈ క్రమంలోనే యువ ఆటగాడు గిల్ కెప్టెన్ అయితే బాగుంటుందని భావిస్తుందంట బిసిసిఐ. అతన్ని హార్దిక్ డిప్యూటీగా భావించడంతోపాటు ఫ్యూచర్ కెప్టెన్ గా తీర్చిదిద్దాలని అనుకుంటుందట.

 ఈ క్రమం లోనే ప్రస్తుతం భారత జట్టు లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి సీనియర్ ప్లేయర్లు ఉన్న సమయంలోనే ఇక గిల్ ను కెప్టెన్గా సంసిద్ధం చేయాలని అనుకుంటున్నట్లు సమాచారం. ఇక ఈ సీనియర్ ప్లేయర్లు ఇచ్చే ఇన్పుట్స్ తో గిల్ లో దాగి ఉన్న నాయకత్వ ప్రతిభను మరింత మెరుగుపరచాలని అనుకుంటుందట బీసీసీఐ. ఇక ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తుంటే హార్దిక్ పాండ్యా తర్వాత ఇక భారత ఫ్యూచర్ కెప్టెన్ గిల్ అవడం ఖాయం అనేది తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: