మొన్నే రిటైర్మెంట్.. అంతలోనే మనసులో మాట బయట పెట్టిన వార్నర్?

praveen
ఆస్ట్రేలియా జట్టులో స్టార్ ఫేసర్ గా కొనసాగిన డేవిడ్ వార్నర్ ఇటీవల తన పదేళ్ల కెరియర్ కు రిటైర్మెంట్ ప్రకటిస్తు నిర్ణయం తీసుకున్నాడు అనే విషయం తెలిసిందే. ఇంకోన్నాళ్ళ పాటు డేవిడ్ వార్నర్ అంతర్జాతీయ క్రికెట్లో కొనసాగుతాడేమో అని అనుకున్నప్పటికీ ఇక వార్నర్ మాత్రం తన కెరీర్ కు వీడ్కోలు పలకడానికి మొగ్గు చూపాడు. ఇప్పుడు వరకు అటు ఆస్ట్రేలియా జట్టు తరఫున ఓపెనర్ గా ఎన్నో అద్భుతమైన ఇన్నింగ్స్ లు అడిగి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న ఈ ప్లేయర్.. ఇటీవల టెస్టులతో పాటు వన్డే ఫార్మాట్ కి కూడా రిటైర్మెంట్ ప్రకటించాడు.

 అయితే ఈ ఏడాది జూన్ 1వ తేదీ నుంచి ప్రారంభం కాబోయే 2024 t20 వరల్డ్ కప్ తర్వాత ఇక ఈ పొట్టి ఫార్మాట్ నుంచి కూడా వార్నర్ తప్పుకునే అవకాశం ఉంది అన్నది తెలుస్తుంది. అయితే ఇక ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించిన వార్నర్.. తన భవిష్యత్తు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సాధారణంగా క్రికెట్లో ఇక రిటైర్మెంట్ ప్రకటించిన ప్రతి ప్లేయర్ కూడా వ్యాఖ్యాతగా మారడం లేదంటే కోచ్ గా అవతారం ఎత్తడం లాంటివి సాంప్రదాయంగా కొనసాగుతూ వస్తుంది. ఇప్పటివరకు ఎంతోమంది ప్లేయర్లు ఇలా క్రికెట్కు వీడ్కోలు పలికిన తర్వాత కోచ్గా అవతారమెత్తి క్రికెట్కి దగ్గరగానే ఉన్నారు.

 ఇక ఇటీవల డేవిడ్ వార్నర్ కూడా ఇదే తరహాలో తన మనసులో మాటను బయటపెట్టాడు. భవిష్యత్తులో తనకు కోచ్గా పని చేయాలని ఉంది అంటూ చెప్పుకొచ్చాడు డేవిడ్ వార్నర్. క్రికెట్ నుంచి పూర్తిగా తప్పుకున్న తర్వాత కోచ్ బాధ్యతలు చేపడతాను అంటూ తెలిపాడు. కోచ్గా రాణిస్తానని నమ్మకం నాకు ఉంది అంటూ చెప్పుకొచ్చాడు. ఈ విషయం గురించి ఇప్పటికే నా భార్యకు తెలిపాను. ఆమె కూడా ఈ విషయంపై సానుకూలంగానే స్పందించింది అంటూ తెలిపాడు. కాగా ఇటీవల పాకిస్తాన్ తో చివరి టెస్ట్ మ్యాచ్ తో వార్నర్ టెస్ట్ ఫార్మాట్కు వీడ్కోలు పలికాడు అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: