ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్ జరగబోయే స్టేడియం.. ఇలా ఉందేంటి?

praveen
ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులందరూ కూడా హై వోల్టేజ్ మ్యాచ్ అని పిలుచుకునే మ్యాచ్ ఏది అంటే అది ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ అని చెప్పాలి. ఎందుకంటే ఈ రెండు దేశాల మధ్య ఎప్పుడు మ్యాచ్ జరిగిన కూడా ఇక అది నువ్వా నేనా అన్నట్లుగానే సమరం కొనసాగుతూ ఉంటుంది. సాధారణంగా అయితే ఏదైనా రెండు దేశాలు ఒక మ్యాచ్లో తలబడ్డాయి అంటే ఇక కేవలం ఆ రెండు దేశాల క్రికెట్ ప్రేక్షకులు మాత్రమే మ్యాచ్ చూడడానికి ఎక్కువగా ఆసక్తిని కనబరూస్తూ ఉంటారు. కానీ ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ జరిగిందంటే చాలు క్రికెట్ ప్రపంచం మొత్తం ఎన్ని పనులు ఉన్నా పక్కన పెట్టేసి ఇక ఈ మ్యాచ్ ని ఒక్క నిమిషం కూడా మిస్ కాకుండా చూడటానికి ఇష్టపడుతూ ఉంటారు అని చెప్పాలి.

 ఈ క్రమంలోనే 2023 ఏడాదిలో ఆసియా కప్ వన్డే వరల్డ్ కప్ రూపంలో ఏకంగా రెండుసార్లు ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ చూసే అవకాశం లభించింది. అయితే ఇక ఈ ఏడాది టీ20 వరల్డ్ కప్ జరగబోతుంది. ఇక ఈ వరల్డ్ కప్ లో భాగంగా ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ ఎప్పుడు జరుగుతుంది అని ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులందరూ కూడా ఎదురు చూశారు. అయితే ఇటీవల టి20 వరల్డ్ కప్ కు సంబంధించిన షెడ్యూల్ను ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ విడుదల చేసింది  ఈ క్రమంలోనే జూన్ 1వ తేదీ నుంచి కూడా వరల్డ్ కప్ ప్రారంభం కాబోతుండగా.. జూన్29న భారత్, పాకిస్తాన్ మ్యాచ్ జరగబోతుంది.

 అయితే ఈ దాయాదుల పోరుకి ఉన్న క్రేజ్ దృశ్య.. ఇక మ్యాచ్ జరిగిందంటే చాలు స్టేడియంలో ప్రేక్షకులు అందరూ కిక్కిరిసిపోతూ ఉంటారు.  అయితే టి20 వరల్డ్ కప్ లో భాగంగా అమెరికాలోని న్యూయార్క్ లో ఉన్న నాసా కౌంటి ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఇక ఈ దాయద్దుల పోరుకు వేదికగా మారనుంది. అయితే ఈ మైదానంలో స్థానికులు క్రికెట్ ఫుట్బాల్ ఆడుతున్నారు. చుట్టూ ప్రేక్షకులు కూర్చునేందుకు కనీసం గ్యాలరీ కూడా లేదు  దీంతో ఇక ఈ స్టేడియం ను చూసి ఫాన్స్ అందరు షాక్ అవుతున్నారు.  ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ కి వచ్చిన ప్రేక్షకులు ఎక్కడ కూర్చోవాలో అని ఆందోళన చెందుతున్నారు. అయితే ఇంకా ఈ మ్యాచ్ కి ఆరు నెలల  సమయం ఉండడంతో అప్పటిలోపు ఇక అన్ని ఏర్పాట్లు చేసే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: