రైలులో చలిమంట వేసుకున్నారు.. చివరికి ఏమైందో తెలుసా?

praveen
ఈ భూమి మీద ఎన్నో రకాల జీవరాసులు ఉన్నప్పటికీ అన్ని జీవుల్లోకెల్లా మనిషి అనే జీవి మాత్రం తెలివైనది అని శాస్త్రవేత్తలు చెబుతూ ఉంటారు. ఎందుకంటే పరిస్థితులకు తగ్గట్లుగా ప్రవర్తించడం ఎదుటి వారి విషయం లో మర్యాద పూర్వకంగా వ్యవహరించడం ఇలా ఎప్పటికప్పుడు విచక్షణ తో ప్రవర్తించడం కేవలం మనుషుల తోనే సాధ్యమవుతుంది అని ఎన్నో పరిశోధనలో కూడా వెళ్లడైంది. అయితే ఇటీవల కాలంలో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూస్తుంటే అటు మనుషుల్లో కూడా విచక్షణ జ్ఞానం తగ్గిపోతుందేమో అనే భావన ప్రతి ఒక్కరికి కూడా కలుగుతుంది.

 ఎందుకంటే పరిస్థితులకు తగ్గట్లుగా ప్రవర్తిస్తూ ముందుకు సాగే వాడే మనిషి. కానీ ఇటీవల కాలం లో ఇక పరిస్థితులకు విరుద్ధం గా ప్రవర్తిస్తున్న వారే మనుషులు అని ఉదాహరణ ఇచ్చే విధంగా ఎన్నో ఘటనలు వెలుగు లోకి వస్తూ ఉన్నాయి. చేసేది తప్పు అని తెలిసినప్పటికీ ఎంతో మంది ఇతరులను ఇబ్బంది పెట్టడానికి కూడా సిద్ధమైపోతున్నారు. ఇక్కడ వెలుగులోకి వచ్చిన ఘటన కూడా ఇలాంటి కొవలోకి చెందినదే.. ఎక్కడికైనా జర్నీ చేస్తున్నప్పుడు ఇష్టానుసారం గా ప్రవర్తించడానికి అవకాశం ఉండదు. అలా ప్రవర్తిస్తే ఇతరులకు ఇబ్బంది ఏర్పడుతుంది. కొన్ని కొన్ని సార్లు ఇతరుల ప్రాణాల మీదికి కూడా వస్తూ ఉంటుంది.

 ఇక్కడ కొంత మంది వ్యక్తులు ఏకంగా విచక్షణ కోల్పోయి ప్రవర్తించారు. రైలులో చలిమంట వేసి ఏకంగా వందల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టారు. ఈ ఘటన అస్సాం నుంచి ఢిల్లీకి వెళ్లే సంపర్క్ క్రాంతి ఎక్స్ ప్రెస్ లో వెలుగులోకి వచ్చింది. జనరల్ కంపార్ట్మెంట్ లో ప్రయాణిస్తున్న చందన్, దేవేంద్ర తమ వెంట తెచ్చుకున్న పిడకలకు నిప్పంటించి చలి కాచుకోవడం మొదలుపెట్టారు. భోగి నుంచి పొగరావడం గమనించిన సిబ్బంది వెంటనే అప్రమత్తం అయ్యారు. అయితే చలి తట్టుకోలేక ఇలా చేసినట్లు సదరు ప్రయాణికులు చెప్పడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: