ఎంత డబ్బు కావాలి.. ఇండియా vs పాక్ మ్యాచ్ ఫై ఐర్లాండ్ షాకింగ్ కామెంట్స్?

praveen
ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే చాలు ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులందరిలో ఆసక్తి ఎంతలా పెరిగిపోతూ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఈ రెండు దేశాల మధ్య క్రికెట్ సంబంధాలపై నిషేధం కొనసాగుతూ ఉంది. ఈ క్రమంలోనే ఇక ప్రపంచ క్రికెట్లో ఉన్న అన్ని టీమ్స్ ఆడినట్లుగా పాకిస్తాన్, ఇండియా దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్ లు జరగవు. దీంతో కేవలం ఐసీసీ టోర్నీలలో మాత్రమే ఈ రెండు టీమ్స్ మధ్య మ్యాచ్ చూసేందుకు అవకాశం ఉంటుంది. ఈ క్రమంలోనే ఇక ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ అంటే చాలు వరల్డ్ క్రికెట్లో స్పెషల్ క్రేజ్ ఏర్పడింది అని చెప్పాలి.

 ఎప్పుడో ఒకసారి వరల్డ్ కప్ జరిగినప్పుడు మాత్రమే జరిగే మ్యాచ్ కావడంతో ఈ మ్యాచ్ ని చూసేందుకు ఇరుదేశాల క్రికెట్ ప్రేక్షకులు మాత్రమే కాదు ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు సైతం తెగ ఆసక్తిని కనబరిస్తూ ఉంటారు అని చెప్పాలి. అయితే 2024 t20 వరల్డ్ కప్ లో భాగంగా ఈ ఏడాది మరోసారి ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ చూసేందుకు అవకాశం వచ్చింది. ఈ క్రమంలోనే ఇటీవల icc వరల్డ్ కప్ కు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేసింది. జూన్ 1వ తేదీ నుంచి వరల్డ్ కప్ ప్రారంభం కాబోతోంది.  జూన్ 9వ తేదీన ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ జరగబోతుంది అని చెప్పాలి.

 అయితే ఇటీవల ఐసీసీ విడుదల చేసిన షెడ్యూల్లో చూసుకుంటే పాల్గొనబోయే 20 జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. అయితే ఒకే గ్రూపులో ఇండియా, పాకిస్తాన్ జట్లు ఉండడం గమనార్హం. ఇదే విషయంపై అటు ఐర్లాండ్ క్రికెట్ బోర్డు ఆసక్తికర ఆరోపణలు చేసింది. టి20 వరల్డ్ కప్ షెడ్యూల్ లో ఇండియా, పాకిస్తాన్ జట్లు ఒకే గ్రూప్లో ఎలా చేరాయి అంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది. ఈ రెండు జట్లు ఒకే గ్రూపులో ఉండొద్దంటే ఎంత డబ్బు కావాలి అంటూ ప్రశ్నించింది. ప్రతిసారి మెగా టోర్నమెంటులో ఈ రెండు జట్లు ఒకే గ్రూపులో ఉంటున్నాయని వ్యాఖ్యానించింది. అసలు ద్వైపాక్షిక సిరీస్ లు ఆడని ఈ రెండు దేశాలు మెగా టోర్నీలో మాత్రం ఒకే గ్రూపులో ఎలా ఉంటున్నాయి అంటూ ప్రశ్నించింది ఐలాండ్ క్రికెట్ బోర్డు. దీంతో ఇది కాస్త ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: