లంచ్ లోపు.. డబుల్ సెంచరీ చేసే సత్తా నీకు ఉంది : వసీం జాఫర్

praveen
దాదాపు దశాబ్ద కాలం పాటు అంతర్జాతీయ క్రికెట్ కెరియర్ను కొనసాగించి ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించాడు ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్. తన ఆట తీరుతో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు అన్న విషయం తెలిసిందే. అంతేకాదు ఇంకా ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగం కావడం ద్వారా భారత క్రికెట్ ప్రేక్షకులందరికీ కూడా మరింత దగ్గర అయ్యాడు డేవిడ్ వార్నర్.

ఇక మరి ముఖ్యంగా.. అటు సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు కెప్టెన్ గా వ్యవహరించి ఒకసారి టైటిల్ అందించి ఇక తెలుగు ప్రేక్షకుల హృదయాలు ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్నాడు వార్నర్. అయితే ఇక ఇటీవల పాకిస్తాన్తో జరిగిన టెస్టు సిరీస్ తనకు చివరి టేస్ట్ అంటూ ప్రకటించాడు. ఇటీవల ఈ టెస్టు సిరీస్ ముగియడంతో ఇక డేవిడ్ వార్నర్ కెరియర్ ఘనంగా ముగిసింది. అయితే అంతకుముందు వన్డే క్రికెట్ కెరీర్ కు కూడా రిటైర్మెంట్ ప్రకటించాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇక వార్నర్ రిటైర్ అయిన నేపథ్యంలో అతను క్రికెట్లో చేసిన సేవలను అతని ప్రతిభ గురించి ఎంతోమంది మాజీ క్రికెటర్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

 ఇటీవల కెరియర్ లో చివరి టెస్ట్ మ్యాచ్ ఆడిన ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్  డేవిడ్ వార్నర్ పై భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్ ప్రశంసలు కురిపించాడు. టి20 బ్యాటర్ గా నీ ప్రయాణం మొదలైంది. కానీ నీటిలో చాపలాగా టెస్టుల్లో కూడా నీ సత్తా ఏంటో చూపించావ్. ఎక్కడ వెను తిరిగి చూసుకోలేదు. లంచ్ లోపు డబుల్ సెంచరీ.. ఎక్కువసేపు క్రీజులో నిలబడితే త్రిబుల్ సెంచరీ చేసే సత్తా నీకు ఉంది. ఇప్పటివరకు నువ్వు సాధించిన ఘనతలపై  గర్వించు అంటూ డేవిడ్ వార్నర్ పై ప్రశంసలు కురిపించాడు వసీం జాఫర్. ఇక మరి కొంతమంది భారత మాజీలు సైతం అటు రిటైర్ అయిన డేవిడ్ వార్న పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: