టెస్టులకు సై అంటున్న రింకు.. రంజిల్లో అద్భుత ఇన్నింగ్స్?

praveen
బిసిసిఐ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఐపిఎల్ టోర్నీ ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్న ఆటగాళ్లలో అటు రింకు సింగ్ కూడా ఒకరు అన్న విషయం తెలిసిందే. గత ఏడాది జరిగిన ఐపీఎల్ సీజన్లో విధ్వంసకరమైన ఆట తీరుతో ఒక్కసారిగా అందరి దృష్టిని తన వైపుకు తిప్పుకున్న ఈ యంగ్ ప్లేయర్.. ఇక తర్వాత భారత జట్టులో కూడా చాన్సులు దక్కించుకున్నాడు అని చెప్పాలి. ఇక టీమిండియా తరఫున కూడా పరిమిత ఓవర్ల ఫార్మాట్లో అదరగొట్టేసాడు.

 మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్ చేయడానికి వచ్చి మెరుపు ఇన్నింగ్స్ లతో టీం ఇండియాను వేధిస్తున్న ఫినిషర్ పాత్రకు తానే సరైన ఆటగాడిని అన్న విషయాన్ని అందరికీ అర్థమయ్యేలా చేశాడు అని చెప్పాలి. అయితే ఇలా మొన్నటి వరకు పరిమిత ఓవర్లు ఫార్మాట్లో విధ్వంసకరా ఆటతీరుతో ఆకట్టుకున్న ఈ ప్లేయర్ ఇక ఇప్పుడు టెస్ట్ ఫార్మాట్ కి కూడా సై అనేలాగే కనిపిస్తూ ఉన్నాడు అని చెప్పాలి. ఎందుకంటే రంజి ట్రోఫీ 2024 సీజన్లో భాగంగా కేరళతో ఇటీవల జరిగిన మ్యాచ్లో రింకు ఉత్తరప్రదేశ్ తరఫున ఎంతో బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.

ఏకంగా 71 పరుగులతో అజేయంగా నిలిచాడు. 13 బంతులు ఎదుర్కొన్న రింకు సింగ్ ఏడు ఫోర్లు 2 సిక్సర్ల సహాయంతో తన ఇన్నింగ్స్ ను అద్భుతంగా మలిచాడు అని చెప్పాలి. అంతేకాదు జట్టుకు గౌరవప్రదమైన స్కోరును అందించడంలో కీలకమైన పాత్ర వహించాడు. 124 పరుగులకే ఉత్తరప్రదేశ్ సగం వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న సమయంలో 54 పరుగుల వద్ద బ్యాటింగ్ చేస్తున్న దృవ్ జూరర్ తో జతకట్టి రింగు 100 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించాడు. అతని ఆట తీరు చూస్తే పరిమిత ఓవర్ల ఫార్మాట్లో దూకుడుగా ఆడటమే కాదు టెస్టులకు తగ్గట్లుగా నెమ్మదిగా ఆడటం కూడా అతనికి తెలుసు అన్నది తెలుస్తుంది. దీంతో భవిష్యత్తులో అతన్ని టీమిండియా తరఫున టెస్టుల్లో కూడా చూసే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: