టి20 వరల్డ్ కప్ షెడ్యూల్ రిలీజ్.. ఇండియా vs పాక్ మ్యాచ్ ఎప్పుడంటే?

praveen
ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ అంటే చాలు వరల్డ్ క్రికెట్లో ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సాధారణంగా వరల్డ్ క్రికెట్లో ఉన్న అన్ని టీమ్స్ కూడా ఇక ద్వైపాక్షిక సిరీస్ లతో  ఎప్పుడు మూడు ఫార్మట్లలో కూడా మ్యాచ్లు ఆడుతూనే ఉంటాయి అన్న విషయం తెలిసిందే. కానీ ఇండియా, పాకిస్తాన్ మధ్య మాత్రం క్రికెట్ సంబంధాలపై నిషేధం కొనసాగుతుంది. అయితే ఈ రెండు దేశాల మధ్య క్రికెట్లో మాత్రమే కాదు సరిహద్దుల వద్ద కూడా వైరం కొనసాగుతూ ఉంటుంది. దీంతో ఇక పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ అంటే చాలు క్రికెట్ ప్రపంచం మొత్తం కాస్త కళ్ళు పెద్దవి చేసుకొని చూస్తూ ఉంటుంది అని చెప్పాలి.
 ఈ మ్యాచ్ లోని ఉత్కంఠను ఎంజాయ్ చేయాలని ప్రతి ఒక్కరు కూడా ఆశ పడుతూ ఉంటారు. దీంతో తమ దేశ జట్టు ఆడుతున్న మ్యాచ్లను వదిలేసి మరి ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ చూసేందుకు ఇష్టపడుతూ ఉంటారు అని చెప్పాలి. అయితే ఈ ఏడాది 2024 t20 వరల్డ్ కప్ ఉన్న నేపథ్యంలో.. ఇక ఈ వరల్డ్ కప్ ద్వారా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ను మరోసారి చూసేందుకు అవకాశం ఉంటుందని ఇరుదేశాల క్రికెట్ ఫ్యాన్స్ మాత్రమే కాదు క్రికెట్ ప్రపంచం మొత్తం  ఎదురుచూస్తుంది. ఈ క్రమంలోనే ఐసిసి వరల్డ్ కప్ షెడ్యూల్ ప్రకటిస్తే ముందుగా ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ ఎప్పుడు ఉంది అని వెతకడం  మొదలుపెట్టారు అందరూ.

 కాగా టి20 వరల్డ్ కప్ షెడ్యూల్ ని ఐసిసి ఇటీవల రిలీజ్ చేసింది. జూన్ 1వ తేదీ నుంచి మ్యాచ్ లు ప్రారంభం కాబోతున్నాయి అని చెప్పాలి. ఇక జూన్ 1వ తేదీ నుంచి 18 వరకు గ్రూప్ స్టేజ్, 19 నుంచి 24 వరకు సూపర్ 8,  26 నుంచి 27 వరకు సెమీఫైనల్స్, ఇక 29వ తేదీన ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది. అయితే ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు అందరూ ఎదురు చూసే ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ జూన్ 9వ తేదీన న్యూయార్క్ వేదికగా జరగబోతుంది అన్న విషయం తెలిసిందే. కాగా ఈ వరల్డ్ కప్ కి అటు అమెరికాతో పాటు వెస్టిండీస్ జట్లు కూడా ఆతిథ్యం ఇస్తూ ఉన్నాయి అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: