షార్టెస్ట్ టెస్ట్ మ్యాచ్.. టెస్ట్ క్రికెట్ చరిత్రలో మొదటిసారి?

praveen
ఇండియా, సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య జరిగిన టెస్ట్ సిరిస్ ఇటీవల  ముగిసింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైన రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ లో ఇరు జట్లు కూడా చేరో మ్యాచ్ గెలిచాయి అని చెప్పాలి. దీంతో సిరీస్ 1-1 తో సమం అయింది. అయితే మొదటి మ్యాచ్లో ఘోరంగా ఓడిపోయిన టీమ్ ఇండియా జట్టు అటు రెండో మ్యాచ్లో మాత్రం అద్భుతంగా పుంజుకుంది. కేఫ్ టౌన్ వేదికగా జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్లో ఏకంగా ఘనవిజయాన్ని అందుకుంది అని చెప్పాలి. అయితే ఇలా విజయం సాధించడం ద్వారా ఒక అరుదైన రికార్డును కూడా సృష్టించింది టీమిండియా.

 అయితే కేప్ టౌన్ వేదికగా జరిగిన రెండో టెస్టు మ్యాచ్ ఎన్నో చెత్త రికార్డులకు వేదికగా మారింది అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే ఇరు జట్ల బ్యాటింగ్ విభాగం పూర్తిగా ఇక్కడి పిచ్ లపై విఫలమైంది. ఎవరు కూడా చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. ఇక రెండో టెస్ట్ మ్యాచ్ లో మొదటి ఇన్నింగ్స్ లో భాగంగా కేవలం 55 పరుగులు మాత్రమే చేసి సౌత్ ఆఫ్రికా చాప చుట్టేస్తే ఇక ఆ తర్వాత 153 పరుగులు చేసి ఆల్ అవుట్ అయింది టీమ్ ఇండియా. తర్వాత ఇరు జట్లు రెండో ఇన్నింగ్స్ లో కూడా తక్కువ పరుగులే నమోదు చేశాయి అని చెప్పాలి. అయితే భారత్ సౌత్ ఆఫ్రికా మధ్య జరిగిన రెండో టెస్టు అరుదైన రికార్డులను నమోదు చేసింది.

 ఏకంగా టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే షార్టేస్ట్  టెస్ట్ మ్యాచ్ గా నిలిచింది రెండో టెస్ట్ మ్యాచ్. ఎందుకంటే ఇది కేవలం ఒకటిన్నర రోజులోనే రెండో టెస్ట్ మ్యాచ్ ముగియడం గమనార్హం. ఇక ఇందులో ఇరు జట్లు కలిపి కేవలం 107 ఓవర్లు మాత్రమే వేసాయి. దీంతో ఫలితం వెలుపడ్డ అత్యంత చిన్న మ్యాచ్ గా ఈ టెస్ట్ మ్యాచ్ నిలిచింది అని చెప్పాలి. జనవరి మూడవ తేదీన ప్రారంభమైన ఈ మ్యాచ్.. జనవరి 7వ తేదీన ముగియాల్సి ఉంది. కానీ ఊహించని రీతిలో కేవలం 107 ఓవర్లలోనే కేవలం ఒకటిన్నర రోజులోనే ఈ మ్యాచ్ ముగిసింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: