టీమిండియా అంత గొప్ప టీం ఏం కాదు.. మాజీ ప్లేయర్ షాకింగ్ కామెంట్స్?

praveen
ప్రస్తుతం భారత జట్టు సౌత్ఆఫ్రికా పర్యటనలో ఉంది అన్న విషయం తెలిసిందే. ఇక ఈ టూర్ లో భాగంగా ప్రస్తుతం టెస్ట్ సిరీస్ ఆడుతుంది టీమిండియా. ఇక భారత జట్టు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించిన టెస్టు సిరీస్ లో అద్భుతంగా రాణిస్తుంది అనుకున్నప్పటికీ ఊహించని రీతిలో ఘోర పరాజయాన్ని చవి చూసింది అన్న విషయం తెలిసిందే. సఫారి జట్టుకు వారి సొంత గడ్డపై ఏమాత్రం పోటీ ఇవ్వలేక చిత్తుగా ఓడిపోయింది. ఏకంగా 32 పరుగులతో పాటు ఒక ఇన్నింగ్స్ తేడాతో ఓడిపోయి దారుణమైన పరాజయం పాలు అయింది టీం ఇండియా. ఈ క్రమంలోనే టీమిండియా ప్రదర్శన పై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి.

 అయితే ప్రపంచ స్థాయి బౌలర్లు బ్యాట్స్మెన్లు ఉన్నప్పటికీ ఒక్కరు కూడా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయారు. మరీ ముఖ్యంగా బౌలర్లు అయితే ఇక సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్ లకు భారీగా పరుగులు సమర్పించుకోవడానికి సౌత్ ఆఫ్రికా టూర్ కి వచ్చారేమో అన్న విధంగా ప్రదర్శన కొనసాగించారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇప్పటికీ కూడా ఈ ఘోర పరాజయంపై టీమిండియా విమర్శలు ఎదుర్కొంటూనే ఉంటుంది. ఇదే విషయంపై స్పందించిన టీమిండియా మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

 ఏకంగా మొదటి టెస్ట్ మ్యాచ్లో టీమ్ ఇండియా పేలవ ప్రదర్శన పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. టీమిండియా అందరూ అనుకున్నంత గొప్ప టీం ఏమీ కాదు. ఓవర్ రేటెడ్ అంటూ మండిపడ్డాడు కృష్ణమాచారి శ్రీకాంత్. విరాట్ కోహ్లీ కెప్టెన్ గా ఉన్నప్పుడు బాగా రాణించాం.. ఆస్ట్రేలియాను ఇంగ్లాండ్ ను కూడా ఓడించాం.. ఇంగ్లాండులో కూడా దూకుడు చూపించాం.. అటు దక్షిణాఫ్రికాలో కూడా పోరాడాం. టీమిండియా ఐసీసీ ర్యాంకును ఇప్పటికైనా మర్చిపోవాలి.. కుల్దీప్ యాదవ్ లాంటి ఆటగాళ్లకు జట్టులో చోటు ఇవ్వాలి అంటూ కృష్ణమాచారి శ్రీకాంత్ కామెంట్ చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: