24 గంటల్లో 16 న్యూ ఇయర్స్.. అదెలా అంటే?

praveen
ఇటీవలే ప్రపంచం మొత్తం కొత్త సంవత్సరం లోకి అడుగు పెట్టింది. అయితే కొన్ని గంటలు అటు ఇటు అయినా ఇక ప్రపంచ దేశాలు అన్నీ కూడా కొత్త సంవత్సర వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకున్నాయి అని చెప్పాలి. 2023 ఏడాది యొక్క మధుర జ్ఞాపకాలను చేదు అనుభవాలను గుర్తు చేసుకుంటూనే ఇక కొత్త సంవత్సరంలో అంతా మంచి జరగాలి అంటూ కోరుకుంటూ ఇక న్యూ ఇయర్ లోకి అడుగు పెట్టారు అని చెప్పాలి.

 అయితే సాధారణంగా ఒక వ్యక్తి న్యూ ఇయర్ జరుపుకోవాలి అంటే ఇక సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే జరుపుకునేందుకు అవకాశం ఉంటుంది. ఇక ఒకసారి న్యూ ఇయర్ జరుపుకున్నారూ అంటే మళ్ళీ కొత్త సంవత్సరం వేడుకలు జరుపుకోవాలి అంటే ఇక మరో ఏడాది పాటు ఆగాల్సి ఉంటుంది  కానీ 24 గంటల వ్యవధిలోనే ఒకటి కంటే ఎక్కువ సార్లు న్యూ ఇయర్ జరుపుకోవడానికి అవకాశం ఉంటుందా అంటే అలా ఎలా ఉంటుంది అంటారు ఎవరైనా. కానీ ఇక్కడ  మాత్రం ఏకంగా 24 గంటల వ్యవధిలోనే 16 సార్లు కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టవచ్చట.

 అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోని వ్యోమగాములు ఇలా 24 గంటల వ్యవధిలో 16 సార్లు కొత్త సంవత్సరంలోకి ప్రవేశించగలరు. ఎందుకంటే వారు ప్రయాణిస్తున్న అంతరిక్ష కేంద్రం భూమి చుట్టూ గంటకు 28 వేల కిలోమీటర్ల వేగంతో తిరుగుతూ ఉండడం వల్లే ఇది సాధ్యమవుతుంది అని చెప్పాలి. అంటే ప్రతి 90 నిమిషాలకు ఒకసారి వ్యోమగాములు భూమిని చుట్టేస్తారు. దీంతో వేరు వేరు టైం జోన్లలో వేగంగా ప్రయాణిస్తారు. ఇలా వారు ఒక్క రోజులో 16 సూర్యోదయాలు 16 సూర్యాస్తమయాలు చూస్తారు అని చెప్పాలి. ఇలా కేవలం 24 గంటల్లోనే 16 సార్లు కొత్త సంవత్సరంలోకి అడుగు పెడతారు. ఇది వినడానికి నిజంగా విచిత్రంగా ఉంది కదా.

మరింత సమాచారం తెలుసుకోండి:

Nri

సంబంధిత వార్తలు: