సిక్సర్లు కొట్టడంలో.. చరిత్ర సృష్టించిన పసికూన జట్టు ప్లేయర్?

praveen
టాలెంట్ ఎవరి సొత్తు కాదు.. ఇది ముమ్మాటికి నిజం అని నిరూపించే కొంతమంది వ్యక్తులు అప్పుడప్పుడు తెర మీదికి వస్తూ ఉంటారు. అయితే క్రికెట్ లో కూడా ఇక టాలెంట్ ఎవరు సొత్తు కాదు అని నిరూపించే ఆటగాళ్లు చాలామంది అప్పుడప్పుడు వెలుగులోకి వస్తూ ఉంటారు అని చెప్పాలి. సాధారణంగా అత్యుత్తమ ప్రదర్శన అనే మాట వినిపించింది అంటే ఇక వరల్డ్ క్రికెట్లో పటిష్టమైన జట్లుగా కొనసాగుతున్న టీమ్స్ లోని ఆటగాళ్లే ఇక ఇలాంటి ప్రదర్శన చేస్తారు అని అందరూ అనుకుంటూ ఉంటారు.

 అయితే ఇక అందరూ అనుకున్నట్లుగానే ఎంతోమంది పటిష్టమైన టీమ్స్ లోని స్టార్ ప్లేయర్లు ఇక అదిరిపోయే ప్రదర్శనతో ఎప్పుడు వార్తలో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటారు అని చెప్పాలి. అయితే ఇటీవల కాలంలో మాత్రం ఇలా ఎంతోమంది స్టార్ ప్లేయర్లను మించి పసికూన జట్లలో ఉన్న అనామక ప్లేయర్లు సైతం అత్యుత్తమ ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నారు. మహా మహా ప్లేయర్లకు సైతం సాధ్యం కాని రీతిలో ఏకంగా అరుదైన రికార్డులను కూడా సృష్టిస్తూ ఉండడం ఇటీవల కాలంలో చూస్తూ ఉన్నాం. ఇక ఇటీవల కాలంలో ప్రపంచ క్రికెట్లో స్టార్ ప్లేయర్లను సైతం వెనక్కి నెట్టి పసికూన టీం అయినా యూఏఈ జట్టులోని ఆటగాడు ఇక తన బ్యాటింగ్తో చరిత్ర సృష్టించాడు.

 ప్రస్తుతం యూఏఈ కెప్టెన్ గా కొనసాగుతున్న మహమ్మద్ వసీం ఏకంగా అంతర్జాతీయ క్రికెట్లో ఒక క్యాలెండర్ ఇయర్ లో 100 కంటే ఎక్కువ సిక్సర్లు బాదిన తొలి ప్లేయర్ గా నిలిచాడు. ఏకంగా 2023లో అతను 47 మ్యాచ్లలో 101 సిక్సర్లను కొట్టాడు అని చెప్పాలి. టెస్టులతో పాటు టి20 క్రికెట్లో కలిపి ఇలా సిక్సర్లలో సెంచరీ సాధించాడు. గేల్, రోహిత్ శర్మ, సూర్య కుమార్ లాంటి ఆటగాళ్లకు సైతం ఇప్పటివరకు ఈ ఘనత సాధ్యం కాలేదు అని చెప్పాలి. కాగా ఈ ఏడాది రోహిత్ శర్మ 80 సిక్సర్లు కొట్టగా సూర్య కుమార్ యాదవ్ 74 సిక్సర్లతో ఉన్నాడు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: