నా కెరియర్ లో.. నన్ను ఇబ్బంది పెట్టిన బ్యాట్స్మెన్లు వీళ్లే : లియోన్

praveen
ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో ఉన్న అత్యుత్తమ స్పిన్నర్లు ఎవరు అని చర్చతెరమీదికి వచ్చినప్పుడల్లా ఒక స్పిన్నర్ పేరు మొదట వినిపిస్తూ ఉంటుంది. అతను ఎవరో కాదు ఆస్ట్రేలియా జట్టులో స్టార్ బౌలర్గా కొనసాగుతున్న నాథన్ లియోన్. ఏకంగా అతను బౌలింగ్ చేస్తున్నాడు అంటే చాలు ప్రత్యర్థి బ్యాట్స్మెన్ ల వెన్నులో వణుకు పుడుతూ ఉంటుంది. అతని స్పిన్ మాయాజాలం ముందు ఎక్కడ వికెట్ సమర్పించుకుంటామేమోనని ఇక ప్రతి బ్యాట్స్మెన్ కూడా తెగ కంగారు పడిపోతూనే బంతులను ఎదుర్కొంటూ ఉంటాడు అని చెప్పాలి.

 అయితే ఏ ఆటగాడికి ఎక్కడ బంతి వేస్తే వికెట్ దక్కుతుంది అన్న విషయం అతనికి బాగా తెలుసు. అందుకే  లియోన్ ను తెలివైన బౌలర్ అని కూడా అభివర్ణిస్తూ ఉంటారు ఎంతోమంది క్రికెట్ విశేషకులు. ఇక ఇప్పటివరకు అతను అతని కెరియర్లో ఇక ఎంతోమంది దిగ్గజాలకు బౌలింగ్ చేసి వికెట్ దక్కించుకున్నాడు. ఇక ఎన్నో అరుదైన రికార్డులను కూడా క్రియేట్ చేశాడు అని చెప్పాలి. ఇక ఇలాంటి గణాంకాలు ఉన్నాయి కాబట్టే ఇక అతన్ని వరల్డ్ క్రికెట్లో బెస్ట్ స్పిన్నర్ గా అభివర్ణిస్తూ ఉంటారు క్రికెట్ విశ్లేషకులు. ఇలా అత్యుత్తమ స్పిన్నర్ గా కొనసాగుతున్న లియోన్  క్రికెట్లో 500 వికెట్ల మైలురాయిని కూడా అందుకున్నాడు అని చెప్పాలి.

 అయితే ఇటీవలే ఒక స్పోర్ట్స్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ స్టార్ స్పిన్నర్ తన కెరియర్ మొత్తంలో ఎదుర్కొన్న అత్యుత్తమ బ్యాట్స్మెన్లు ఎవరు అన్న విషయాన్ని చెప్పుకొచ్చాడు. తన కెరీర్ మొత్తంలో ఎదుర్కొన్న బెస్ట్ బ్యాట్స్మెన్లు విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్, ఏ బి డివిలియర్స్ అంటూ తెలిపాడు. కాగా నాథన్ లియోన్ ఇప్పటివరకు అతని కెరియర్లో విరాట్ కోహ్లీని ఏడుసార్లు సచిన్ టెండూల్కర్ ని నాలుగు సార్లు ఏబి డివిలియర్స్ ను రెండు సార్లు అవుట్ చేశాడు అని చెప్పాలి. కాగా ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టు పాకిస్తాన్ తో టెస్టు సిరీస్ ఆడుతూ ఉండగా లియోన్ జట్టు విజయాలలో కీలక ప్లేయర్గా  వ్యవహరిస్తూ ఉన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: