రబాడ ను ఎదుర్కొనేందుకు చెమటోడుస్తున్న రోహిత్.. ఆ బౌలర్ తో ప్రాక్టీస్?

praveen
ప్రస్తుతం టీమిండియా జట్టు దక్షిణాఫ్రికా పర్యటనలో ఉంది. ఇక ఈ పర్యటనలో భాగంగా ప్రస్తుతం టెస్ట్ సిరీస్ ఆడుతుంది అని చెప్పాలి. అయితే ఇప్పటివరకు సఫారీ గడ్డపై ఒక్కసారి కూడా టెస్ట్ సిరీస్ గెలవలేకపోయిన టీమ్ ఇండియా.. ఈసారి మాత్రం రోహిత్ కెప్టెన్సీలో తప్పకుండా సిరీస్ గెలిచి నిరీక్షణకు దింపుతుంది అని అందరు అనుకున్నారు. కానీ ఊహించని రీతిలో భారత జట్టుకు మొదటి టెస్ట్ మ్యాచ్ లోనే ఘోర పరాభవం ఎదురైంది. 32 పరుగులతో పాటు ఇన్నింగ్స్ తేడాతో ఓడిపోయింది టీమిండియా.

 ఈ క్రమంలోనే ఈ ఓటమిని అటు భారత జట్టు అభిమానులు అందరూ కూడా అసలు జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే ఇక మొదటి మ్యాచ్ లో ఓడిపోయినప్పటికీ రెండో మ్యాచ్లో మాత్రం పుంజుకొని గెలవాలనే పట్టుదలతో ఉంది భారత జట్టు. జనవరి 3వ తేదీ నుంచి జరగబోయే రెండో మ్యాచ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంది అని చెప్పాలి. అయితే మొదటి మ్యాచ్ లో అదరగొడతాడు అనుకున్నా కెప్టెన్ రోహిత్ శర్మ తీవ్రంగా నిరశపరిచాడు. మొదటి ఇన్నింగ్స్ లో ఐదు పరుగులు రెండో ఇన్నింగ్స్ లో డకౌట్ అయ్యి చెత్త ప్రదర్శన చేశాడు. అయితే రోహిత్ పాలిట సౌత్ ఆఫ్రికా ఫేసర్ రబడా కొరకరాని కోయ్యగా మారాడు. ఎందుకంటే ఇప్పటివరకు అతని బౌలింగ్లో ఏకంగా 14 సార్లు అవుట్ అయ్యాడు రోహిత్.

 ఈ క్రమంలోనే తనకు పెద్ద తలనొప్పిగా మారిపోయిన రబాడాను ఎదుర్కొనేందుకు రోహిత్ కసరత్తులు మొదలు పెట్టాడు. భారత ఫేసర్ ముఖేష్ కుమార్ బౌలింగ్లో రోహిత్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఇటీవల ఏకంగా రెండు గంటల సెషన్లో 45 నిమిషాల పాటు ముకేష్ బౌలింగ్లోనే రోహిత్ ప్రాక్టీస్ చేయడం గమనార్హం. రబడా వేసిన లైన్ అండ్ లెంత్ లోనే నెట్ ప్రాక్టీస్ లో రోహిత్ కు బంతులు సందించాడు ముఖేష్ కుమార్. నాలుగు నుంచి ఆరు మీటర్ల లెంత్ లో బంతి లోపలికి వచ్చే యాంగిల్ లో బంతులు వేయాలని ముఖేష్ కుమార్ కు రోహిత్ శర్మ సూచించాడు. ఇన్ సైడ్ స్వింగింగ్ బంతులు వేయాలని చెప్పాడు  ఇలా రబడ బౌలింగ్ ను ఎదుర్కొనేందుకు బాగానే కష్టపడుతున్నాడు రోహిత్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: