ఏంటీ.. ప్రపంచకప్ సమయంలో.. షమీ ఇంజక్షన్ తీసుకున్నాడా?

praveen
టీమిండియాలో సీనియర్ ఫేసర్ గా కొనసాగుతున్న మహమ్మద్ షమీ వయస్సు పెరుగుతున్న ఇక తన బౌలింగ్ మాత్రం రోజురోజుకీ మరింత పదునవుతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇక అతను సీనియర్ అయిపోయాడు జట్టు నుంచి పక్కన పెట్టాల్సిందే అనే చర్చ వచ్చిన ప్రతిసారి కూడా తన బౌలింగ్ తో అదరగొడుతూ ఏకంగా క్రికెట్ ప్రేక్షకులు అందరిని కూడా ఫిదా చేసేస్తూ ఉన్నాడు ఈ స్టార్ క్రికెటర్. ఇక ఇటీవలే ఇండియా వేదికగా జరిగిన వరల్డ్ కప్ టోర్నీలో అతను బౌలింగ్ తో ఎంతటి అద్భుతం చేసి చూపించాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

 ముందుగా వరల్డ్ కప్ జట్టులోకి షమీని ఎంపిక చేసినప్పటికీ.. తుది జట్టులో మాత్రం చాన్స్ ఇవ్వలేదు. అయితే బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్లో హార్దిక్ పాండ్యా దూరం కావడంతో అంతనికి లక్కీగా జట్టులో ఛాన్స్ దక్కింది. కానీ ఆ తర్వాత అతని ఆట తీరు చూసి లక్కీగా అతనికి ఛాన్స్ దక్కడం కాదు.. అతను రావడమే టీమిండియాకు అదృష్టంగా మారింది అని అందరూ అనుకోవడం మొదలు పెట్టారు. ఎందుకంటే కేవలం ఏడు మ్యాచ్లలో 24 వికెట్లు సాధించాడు. రెండు మ్యాచ్లలొ అయిదు వికెట్ల ప్రదర్శన చేశాడు. ఇక వరల్డ్ కప్ టోర్నీలోనే టాప్ వికెట్ టేకర్ గా కూడా గుర్తింపుని సంపాదించాడు.

 అయితే ప్రస్తుతం చీలమండ గాయంతో బాధపడుతున్న షమీ టీమిండియా ఆడుతున్న టెస్ట్ సిరీస్ కు దూరమయ్యాడు అన్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం మాత్రమే కాదు వరల్డ్ కప్ సమయంలో కూడా ఇదే గాయంతో బాధపడ్డాడు. ఈ క్రమంలోనే వరల్డ్ కప్ సమయంలో షమీ ఏకంగా ఇంజక్షన్స్ సహాయంతో బరిలోకి దిగాడని.. ఇటీవల అతని సన్నిహితులు వెల్లడించారు. టోర్నీ మొత్తం గాయం నొప్పిని భరిస్తూనే ప్రతిరోజు ఇంజక్షన్స్ తీసుకుని షమీ బౌలింగ్ చేశాడట. అయితే వయస్సు పెరుగుతున్న కొద్దీ గాయాలు నయం కావాలంటే చాలా సమయం పడుతుందని ఇక షమీ సన్నిహితుడు చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: