క్రికెట్ చరిత్రలో సంచలనం.. వరల్డ్ కప్ లో ఇదే తొలిసారి?
అయితే ఈ వరల్డ్ కప్ లో భాగంగా పరుగుల ప్రవాహం కొనసాగుతూ ఉంది. ప్రతి మ్యాచ్ లో కూడా ఆటగాళ్లు భారీగా పరుగులు చేస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే సెంచరీలు చేస్తూ చెలరేగిపోతున్నారు. ఇటీవల ఆస్ట్రేలియా ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో కూడా ఇదే జరిగింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్గనిస్తాన్ జట్టులో జాద్రాన్ సూపర్ సెంచరీ చేసి అదరగొట్టాడు. అయితే ఇక ఆ తర్వాత చేదన సమయంలో ఆస్ట్రేలియా 93 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కోరుకుంది. ఇలాంటి సమయంలో మాక్స్ వెల్ వీరోచితమైన పోరాటం చేశాడు.
ఇప్పటికే వరల్డ్ కప్ హిస్టరీలోనే ఫాస్టెస్ట్ సెంచరీ సాధించాడు అన్న విషయం తెలిసిందే. గతంలో ఒక మ్యాచ్లో 41 బంతుల్లో సెంచరీ చేసి రికార్డు సృష్టించాడు. అయితే ఇటీవలే ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన మ్యాచ్లో ఏకంగా డబుల్ సెంచరీ చేశాడు మాక్స్వెల్. ఈ క్రమంలోనే వరల్డ్ కప్ హిస్టరీ లోనే ఒక అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. వరల్డ్ కప్ చరిత్రలో చేజింగ్లో అత్యధిక వ్యక్తిగత పరుగులు చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు మ్యాక్స్వెల్. అయితే తొడ కండరాలు పట్టేసి నొప్పి వేధిస్తున్న ఇక జట్టు విజయం కోసం అతను చేసిన విరోచితమైన పోరాటం మాత్రం ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు అందరినీ ఫిదా చేసేసింది.