రోహిత్ స్ట్రాటజీ ముందు.. పాకిస్తాన్ చేతిలేత్తేసింది : మాజీ సెలెక్టర్

praveen
సాధారణంగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు వరల్డ్ కప్ వీరుడు అనే ఒక బిరుదు ఉంది అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే అప్పటి వరకు ద్వైపాక్షిక సిరీస్లలో రోహిత్ శర్మ ప్రదర్శన ఎలా ఉన్నప్పటికీ.. వరల్డ్ కప్ వచ్చిందంటే చాలు ఇక ప్రేక్షకులందరికీ సరికొత్త రోహిత్ కనిపిస్తూ ఉంటాడు అని చెప్పాలి. ఎందుకో వరల్డ్ కప్ లో రోహిత్ కు పూనకం వచ్చేస్తుందేమో అన్నట్లుగా అతని బ్యాటింగ్ తీరు కొనసాగుతూ ఉంటుంది. గతంలో 2019 వరల్డ్ కప్ లో ఇలాగే పూనకం వచ్చినట్లుగా ఊగిపోయి ఏకంగా ఒకే వరల్డ్ కప్ లో ఐదు సెంచరీలు చేసి సరికొత్త చరిత్రకు నాంది పలికాడు రోహిత్ శర్మ.

 ఇక ఇప్పుడు భారత్ వేదికగా జరుగుతున్న 2023 వన్డే వరల్డ్ కప్ లో కూడా రోహిత్ తన బ్యాటింగ్ విశ్వరూపాన్ని చూపిస్తూ ఉన్నాడు అని చెప్పాలి. ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి మ్యాచ్ లో పరుగుల ఖాతా తెరవకుండానే.. డక్ అవుట్ గా వెనుతిరిగిన రోహిత్ శర్మ.. మిగతా రెండు మ్యాచ్లలో చేసిన ప్రదర్శన మాత్రం మాటల్లో వర్ణించలేని విధంగా ఉంది. ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన మ్యాచ్లో 131 పరుగులు చేసి సెంచరీ తో చేలరేగిపోయిన రోహిత్ శర్మ.. న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో ఏకంగా 86 పరుగులు చేసి అదరగొట్టాడు. ప్రత్యర్థి బౌలర్లపై  పూర్తి ఆదిపత్యం చెలాయించాడు అని చెప్పాలి.

 ఈ క్రమంలోనే భారత్ కెప్టెన్ రోహిత్ ఫామ్, కెప్టెన్సీ వ్యూహాల గురించి మాజీ సెలెక్టర్ సభా కరీం ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ కెప్టెన్సీ, బ్యాటింగ్ ఫామ్ ముందు పాకిస్తాన్ తేలిపోయింది అంటూ పేర్కొన్నాడు. అత్యంత ఒత్తిడి ఉన్న ఈ మ్యాచ్ లో భారత ఆటగాళ్లు పూర్తి సంసిద్ధతతో దిగగా.. పాకిస్తాన్ ప్లేయర్లు మాత్రం ప్రణాళిక లోపంతో కనిపించారు అంటూ అభిప్రాయపడ్డాడు. క్రీజులో నిలబడకుండా రోహిత్ బౌలర్లను వినియోగించాడని.. ప్రశంసలు కురిపించాడు. మిగిలిన మ్యాచ్లలోనూ భారత్ ఇలాంటి ఆట తీరును కనబరిచాడు అంటూ సూచించాడు సభా కరిం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: