ఏపీ: హైకోర్టులో మరో పిటిషన్ వేసిన పిన్నెల్లి.. షాక్ లో అధికారులు..!

Divya
ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్న పేరు మాచర్ల నియోజకవర్గం.. ముఖ్యంగా అక్కడ పిన్నెల్లి పేరు చాలా గట్టిగానే వినిపిస్తోంది.. ఈ క్రమంలోనే విచారణ అధికారులను సైతం మార్చాలంటూ పిన్నెల్లి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో మరొకసారి పిటిషన్ వేసినట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఈ లేఖను పరిణగణంలోకి తీసుకొని రేపటిలోగ ఆర్డర్స్ ఇవ్వాలని కూడా ఈసీ డీజీపీకి ఏపీ హైకోర్టుకు సైతం ఆదేశాలను జారీ చేసినట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు ఈ విషయమే సర్వత్ర ఆసక్తికరంగా మారుతోంది. పిన్నెల్లి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వేసిన మరో పిటిషన్ ఏపీ అసెంబ్లీ లోక్సభ ఎన్నికల సందర్భంగా తన పైన నమోదైన కేసులకు సంబంధించి విచారణ అధికారులను మార్చాలంటూ కూడా కోరుతూ లంచ్ మోషన్ పిటిషన్లు దాఖలు చేశారట.

దీంతో ఆ విచారణకు సైతం అనుమతించింది కోర్టు తన పైన నమోదైన కేసులలో దర్యాప్తు అధికారులు కేవలం తనను మాత్రమే టార్గెట్ చేస్తున్నారనే విధంగా పిటిషన్ లో తెలియజేశారు. ఆయన వినతిపైన ఈ రోజు కల్లా నిర్ణయాన్ని తెలియజేయాలంటూ కేంద్ర ఎన్నికల సంఘం హైకోర్టు కూడా ఉత్తర్వులను జారీ చేసింది. ముఖ్యంగా దర్యాప్తు అధికారులతో పాటు ఐజిని కూడా మార్చాలంటూ పిటిషన్లో పిన్నెల్ని తెలియజేశారు. దీంతో ఈ లేఖను పరిగణంలోకి తీసుకోవాలని తీసి డీజీపీకి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చాలా స్పష్టం చేసింది.

అందుకు సంబంధించి ఈ ఈరోజులోపు ఆర్డర్ ఇవ్వాలని ఈసి డీజీపీకి హైకోర్టు ఆదేశాలను జారీ చేసిందట. హైకోర్టు ఆదేశాల మేరకే పిన్నెల్లి పల్నాడు లో ఎంట్రీ ఇచ్చారు. మే 29 అర్థరాత్రి 12 గంటల సమయంలో తన లాయర్లతో కలిసి పల్నాడు  ఎస్పీ ముందుకి హాజరయ్యారు పిన్నెల్లి. ఎన్నికల అల్లర్ల కేసుల రామకృష్ణారెడ్డికి మెయిల్ ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పలుచరర్తులతో విధించింది ముఖ్యంగా ఆ కండిషన్లో భాగంగానే ఎస్పీ ముందు హాజరైనట్లుగా తెలుస్తోంది. కార్యకర్తలను కంట్రోల్ చేయడంతో పాటు పాస్పోర్టు వంటివి కూడా సరెండర్ చేయాలని పార్లమెంట్ పరిధిలోనే ఉండాలంటే కండిషన్లు పెట్టారు అలాగే అడ్రస్ మొబైల్ నెంబర్స్ ఇవ్వాలని కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: