జగన్: వచ్చేది మన ప్రభుత్వమే.. ఫ్యాన్స్ కి బూస్ట్..!

Divya
ఏపీలో అధికారం పైన మరొక సారి సీఎం జగన్మోహన్ రెడ్డి తన ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ మరొకసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నామని చాలా క్లారిటీగా తెలియజేశారు. ప్రజల ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నిన్నటితో సరిగ్గా ఐదేళ్లు పూర్తి అయింది.. గత అనుభవాలను గుర్తు చేసుకుంటూ ఒక ట్విట్ చేశారు. ఓటింగ్ పూర్తి అయిన తర్వాత టూర్ కి వెళ్లిన జగన్ కుటుంబం ఈ రోజున తిరిగి ఇండియాకి రాబోతున్నట్లుగా తెలుస్తోంది. గతంలో కూడా ఐ ప్యాక్ టీం కి అభినందనలు తెలిపి వచ్చేది మన ప్రభుత్వమే అన్నట్లుగా తెలియజేశారు.

ఈసారి ఆంధ్రప్రదేశ్ ఫలితాలు చూసి దేశం నెవ్వెర పోతుంది అనే ధీమాని కూడా తెలియజేశారు. ఈ విషయం కార్యకర్తలలో మంచి జోషిని నింపింది. జూ నాలుగున ఫలితాలు విడుదలయితే జూన్ 9న విశాఖ వేదికగా ప్రమాణ స్వీకారం చేస్తామంటూ కూడా వైఎస్ఆర్సిపి అధికారిక వెబ్సైట్లో సందేశాన్ని కూడా పోస్ట్ చేయడం వైసిపి గెలుపు దిమాను మరింత కనిపించేలా చేస్తోంది. ఇదంతా ఇలా ఉంటే తాజా తన ట్విట్టర్ వేదికగా జగన్ పలు వ్యాఖ్యలు చేశారు.

దేవుడి దయ ప్రజలు ఇచ్చిన చారిత్రాత్మకంగా తీర్పుకు సరిగ్గా ఐదేళ్ల క్రితం ఇదే రోజు వైఎస్ఆర్సిపి అధికారంలోకి వచ్చిందని.. కులం మతం ప్రాంతం రాజకీయాలు చూడకుండా ప్రతి కుటుంబానికి కూడా మంచి చేశామంటూ తెలిపారు. ప్రజలందరి దీవెనలతో మళ్లీ ఏర్పాటు కానున్న ఈ ప్రభుత్వం ఇదే మంచిని కొనసాగిస్తూ రాష్ట్ర సమగ్రాభివృద్ధి దిశగా అడుగులు వేస్తామంటూ కూడా స్పష్టం చేశారు దీంతో వైయస్ జగన్మోహన్ రెడ్డి రెండవసారి అధికారంలోకి వస్తారని ధీమా కనిపిస్తున్నది. ఇప్పటికే విశాఖలో అన్ని హోటల్స్ రూములు, బస్సు, ట్రైన్ ఫ్లైట్ టికెట్స్ అన్నీ కూడా బుక్ అయిపోయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇవన్నీ ఎలా ఉన్నప్పటికీ జూన్ ఫలితాలు ఒక స్పష్టతకు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే జగన్ ట్వీట్ తో కార్యకర్తలకు అటు నేతలకు మరోసారి ఉత్సాహాన్ని నింపుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: