జట్టులోకి రీ ఎంట్రీపై.. బుమ్రా ఏమన్నాడో తెలుసా?
బుమ్రా లేని భారత బౌలింగ్ విభాగం ఎక్కడ ప్రత్యర్థులపై సత్తా చాటిన దాఖలాలు కూడా లేవు. దీంతో బుమ్రా వస్తేనే మళ్ళీ టీమిండియా పటిష్టంగా కనిపిస్తుందని.. ఎంతోమంది మాజీ ఆటగాళ్ళు కూడా అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే అదిగో వస్తాడు ఇదిగో వస్తాడు అని వార్తలు రావడం తప్ప బుమ్రా ఎంట్రీ పై సరైన క్లారిటీ రాలేదు. కానీ ఇక పూర్తిస్థాయి ఫిట్నెస్ సాధించిన బుమ్రా ఐర్లాండ్ పర్యటనలో టీమ్ ఇండియాలో చేరేందుకు సిద్ధమయ్యాడు. అదే సమయంలో ఇక భారత జట్టు కెప్టెన్సీ బాధ్యతలను కూడా చేపట్టబోతున్నాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే బుమ్రా పునరాగమనంతో టీమిండియా ఫ్యాన్స్ అందరు కూడా ప్రస్తుతం సంతోషంలో మునిగిపోయారు.
అయితే దాదాపు పది నెలల తర్వాత గాయం నుంచి కోలుకుని మళ్ళీ జట్టులోకి పునరాగమనం చేయడంపై బుమ్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐర్లాండ్తో జరగనున్న మూడు మ్యాచ్ ల టి20 సిరీస్లో బుమ్రా కెప్టెన్సీ చేపట్టనున్నాడు. అయితే ఇటీవల మీడియా సమావేశంలో మాట్లాడుతూ. క్రికెట్ ఆడెందుకు ఎదురు చూస్తున్నాను. గాయం నుంచి ప్రస్తుతం నా శరీరం పూర్తిగా కోరుకుంది. అయితే గాయం కాగానే నా పని అయిపోయిందని నేను అనుకోలేదు. సమస్యను ఎలా పరిష్కరించుకోవాలో అనే విషయంపై దృష్టి పెట్టాను అంటూ బుమ్రా చెప్పుకొచ్చాడు. అయితే ఐర్లాండ్ పర్యటనలో బుమ్రా సూపర్ ఫాం కనబరిచాడు అంటే ఇక టీమిండియా కు వరల్డ్ కప్ లో తిరుగులేదు అని చెప్పాలి.