2 ఓవర్లలో 2 పరుగులే.. ఏం బౌలింగ్ వేసాడబ్బా?

praveen
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా అటు బ్యాట్స్మెన్లు మాత్రమే కాదు బౌలర్లు కూడా బ్యాట్స్మెన్ లను బెంబేలెత్తించే విధంగా బౌలింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఎన్నో అరుదైన రికార్డులు కూడా సృష్టిస్తూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. ఇక ఇటీవల ఐపీఎల్లో భాగంగా లక్నోసూపర్ జెయింట్స్ రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ఎంతో ఉత్కంఠ గా సాగింది. ఈ మ్యాచ్ నువ్వా నేనా అన్నట్లుగా సాగగా.. చివరికి రాజస్థాన్ రాయల్స్ జట్టు చేజేతులారా  చేసుకున్న తప్పులతో ఓడిపోయింది అన్న విషయం తెలిసిందే.


 అయితే ఈ మ్యాచ్ లో అటు రాజస్థాన్ రాయల్స్ జట్టు తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న స్టార్ ఫాస్ట్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ తన బౌలింగ్ తో నిప్పులు చేరిగాడు అని చెప్పాలి. ఎక్కడ ప్రత్యర్థి బ్యాట్స్మెన్లు కనీసం పరుగులు చేయడానికి కూడా వీల్లేకుండా పూర్తి ఆధిపత్యాన్ని చెల్లాయించాడు. సాధారణంగా అయితే పవర్ ప్లే లో బ్యాట్స్మెన్లు పవర్ హిట్టింగ్ చేస్తూ ఉంటారు. వచ్చిన ప్రతి బంతిని కూడా బౌండరీకి తరలించాలని ప్రయత్నిస్తూ ఉంటారు. కారణం కేవలం ముగ్గురు ఫీల్డర్లు మాత్రమే అటు సర్కిల్ బయట ఉంటారు. కాబట్టి ఎంతో అలవోకగా సిక్సర్లు ఫోర్లు కొట్టేందుకు అవకాశం ఉంటుంది అని చెప్పాలి.



 బ్యాట్స్మెన్లు దూకుడుగా ఆడాలని మైండ్ సెట్ తో ఉన్న సమయంలో ఇక వారికి బౌలింగ్ చేయడం... పరుగులు కట్టడి చేయడం అంటే ప్రతి బౌలర్ కి కూడా సవాలుతో కూడుకున్నదే. అలాంటిది ట్రెంట్ బౌల్ట్ మాత్రం అటు పవర్ హిట్టింగ్ కి మారుపేరైన పవర్ ప్లే లో బౌలింగ్ తో నిప్పులు చెరిగాడు. బ్యాట్స్మెన్లను బెంబేలెత్తించాడు అని చెప్పాలి. ఇన్నింగ్స్ తొలి ఓవర్ ని మెయిడిన్ చేశాడు ట్రెండ్ బౌల్ట్. ఇక తన రెండో ఓవర్లు కేవలం రెండు పరుగులు మాత్రమే ఇచ్చాడు అని చెప్పాలి. ఇక తన మూడో ఓవర్లో బౌల్ట్ 12 పరుగులు సమర్పించుకున్నాడు. ఇలా రెండు ఓవర్లలో కేవలం రెండు పరుగులు మాత్రమే ఇచ్చి ఔరా అనిపించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: