ఆ తప్పే.. మా ఓటమికి కారణమైంది : నితీష్ రానా

praveen
ఇటీవలే కోల్కత్తా నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్ ఎంత ఉత్కంఠ భరితంగా  సాగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నువ్వా నేనా అన్నట్లుగా సాగిన ఉత్కంఠభరితమైన పోరులో చివరికి ముంబై ఇండియన్స్ విజయం సాధించింది అని చెప్పాలి. అయితే అటు కోల్కతా నైట్ విజయం కోసం చివరి వరకు పోరాడినప్పటికీ  వారికి ఓటమి తప్పలేదు అని చెప్పాలి. ఒకవైపు కోల్కతా జట్టులో కీలక ప్లేయర్గా కొనసాగుతున్న వెంకటేష్ అయ్యర్ సెంచరీ తో చెలరేగినప్పటికీ కూడా కోల్కతా జట్టు విజయం సాధించలేకపోయింది అని చెప్పాలి.



 కాగా 15 ఏళ్ల తర్వాత కోల్కతా నైట్ రైడర్స్ జట్టు తరఫున వెంకటేష్ అయ్యర్ సెంచరీ చేశాడు అని చెప్పాలి. అయితే మ్యాచ్ అనంతరం ఓటమిపై స్పందించిన కోల్కతా కెప్టెన్ నితీష్ రానా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బ్యాటింగ్లో 20 పరుగులు తక్కువగా చేయడంతో పాటు పవర్ ప్లే లో ఎక్కువగా పరుగులు ఇవ్వడమే ఓటమిని శాసించింది అంటూ కెప్టెన్ నితీష్ రానా చెప్పుకొచ్చాడు. వెంకటేష్ అయ్యర్ సెంచరీ చేసినప్పటికీ గెలవకపోవడం నిజంగా ఎంతో బాధగా ఉంది అంటూ వ్యాఖ్యానించాడు. ఈ మ్యాచ్ లో మరో 20 పరుగులు చేసి ఉంటే బాగుండేది. ముంబై స్పిన్నర్ పియూస్ చావ్లా అద్భుతంగా బౌలింగ్ చేసి మమ్మల్ని కట్టడి చేశాడు.



 ఇక వెంకటేష్ అయ్యర్ చేసిన శతకం కోల్కతా నైట్ రైడర్స్ తరఫున రెండో సెంచరీ అన్న విషయం జటులో ఉన్న అందరికీ తెలుసు. భవిష్యత్తులో మా ప్లేయర్లు మరిన్ని సెంచరీలు బాధేస్తారు అంటూ ధీమా వ్యక్తం చేశాడు నితీష్ రాన. ముంబై బ్యాట్స్మెన్లు మా అత్యుత్తమ బౌలర్ల పై కూడా విలుచుకుపడ్డారు. పవర్ ప్లే లో మేము మరింత మెరుగ్గా బౌలింగ్ చేసి పరుగులను కట్టడి చేసి ఉంటే బాగుండేది. ఇక రానున్న మ్యాచ్లలో మా బౌలింగ్ విభాగం మరింత మెరుగ్గా రాణిస్తుందని ఆశిస్తున్నా అంటూ నితీష్ రానా చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: