ఫైనల్ చేరడమే గొప్ప.. పాక్ జట్టు పై ఆ దేశ మాజీ సెటైర్?

praveen
ఇటీవలే ఆస్ట్రేలియాలోని ఆడిలైట్ స్టేడియం వేదికగా జరిగిన కీలకమైన ఫైనల్ మ్యాచ్లో ఇండియా, పాకిస్తాన్ మధ్య హోరాహోరీ పోరు జరిగింది. ఇక ఈ మ్యాచ్ లో భాగంగా పాకిస్తాన్ జట్టు ఓడిపోయి కేవలం రన్నరఫ్ గా మాత్రమే సరిపెట్టుకుంది అన్న విషయం తెలిసిందే. 1992 వరల్డ్ కప్ సెంటిమెంట్ ఇప్పుడు కూడా నిజం అవుతుందని పాకిస్తాన్ విశ్వవిజేతగా నిలుస్తుంది అని  పాకిస్తాన్ అభిమానులు నమ్మకం పెట్టుకున్నప్పటికీ అది జరగలేదు. పాకిస్తాన్ అటు టీమ్ ఇంగ్లాండ్కు పోటీ ఇచ్చినప్పటికి ఎందుకో చివరికి ఇంగ్లాండ్ మాత్రం అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకుంది. ఈ క్రమంలోనే పాకిస్తాన్ ఓడిపోవడంపై ఎంతో మంది మాజీ క్రికెటర్లు స్పందిస్తూ తమదైన శైలిలోనె సమాధానాలు చెబుతూ ఉండడం గమనార్హం.


 ఏకంగా కొంతమంది అయితే సొంత జట్టు పైనే సెటైర్లు వేస్తూ షాకింగ్ కామెంట్స్ చేస్తూ ఉన్నారు అని చెప్పాలి. అయితే ఇటీవల  ఫైనల్ ఇంగ్లాండ్ చేతిలో పాకిస్తాన్ జట్టు ఓడిపోవడంపై పాకిస్తాన్ మాజీ ఫేసర్ మహమ్మద్ అమీర్ ఏకంగా సెటైరికల్ గా షాకింగ్ కామెంట్స్ చేశాడు. పాకిస్తాన్ జట్టు ఫైనల్ కు చేరడమే గొప్ప అన్నట్లుగా ఆయన మాట్లాడాడు. మనం ఫైనల్ ఎలా చేరామో ప్రపంచం మొత్తానికి తెలుసు అంటూ మహమ్మద్ అమీర్ చేసిన వ్యాఖ్యలు కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయాయి.



 అల్లా మనకు సాయం చేయడం వల్లే అదృష్టవశాత్తు ఫైనల్కు చేరాం. మన బ్యాటర్ల ప్రదర్శన చూస్తే ఫలితం ముందే అర్థమైపోయింది అంటూ చెప్పుకొచ్చాడు. సిడ్నీ నుంచి వచ్చేసిన తర్వాత ఇక్కడ ఇలాంటి ఫలితమే వస్తుందని అమిర్ ముందే ఊహించాడట. ఇక ఇదే విషయాన్ని ఇటీవలే ఫైనల్ లో ఇంగ్లాండ్ చేతిలో పాకిస్తాన్ ఓడిపోయిన తర్వాత మరోసారి చెప్పుకొచ్చాడు. భారత్తో మ్యాచ్లో ఉన్నట్లుగానే పిచ్ ఉంటే పాకిస్తాన్ మళ్లీ తడబడుతుందని ముందే చెప్పాను. అదే జరిగింది. టాస్ తర్వాత మనకు మంచి ఆరంభం దక్కింది. అక్కడి పరిస్థితులు మనకు తెలుసు అంటూ చెప్పుకొచ్చాడు. కానీ పాకిస్తాన్ మాత్రం తను అంచనా వేసినట్లే ఇబ్బంది పడిందని.. ఫైనల్ లో బ్యాట్స్మెన్లు పెద్దగా రాణించలేదు. అందుకే పెద్ద లక్ష్యాన్ని ఇంగ్లాండుకు నిర్దేశించలేదు. తద్వారా ఇంగ్లాండ్ అలవోకగా విజయం సాధించింది అంటూ మహమ్మద్ అమీర్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: