వరల్డ్ కప్ నుండి ఆస్ట్రేలియా అవుట్... "వెరీ షేమ్" !

VAMSI
అక్టోబర్ 16 వ తేదీ నుండి ఆస్ట్రేలియా లో జరుగుతున్న టీ 20 ప్రపంచ కప్ జరుగుతోంది. ఈ టోర్నీలో టైటిల్ కోసం మొత్తం 16 జట్లు పోటీ పడ్డాయి. కానీ చివరికి నాలుగు జట్లు మాత్రమే సెమీస్ కు అర్హత సాధించి టైటిల్ అవకాశాలను మరింత మెరుగుపరుచుకుంటాయి. ఈ రోజు ఇంగ్లాండ్ మరియు శ్రీలంక ల మధ్య ముగిసిన ఆఖరి మ్యాచ్ తో గ్రూప్ 1 లో సెమీఫైనల్ జట్లు ఫైనల్ అయ్యాయి. ఇంతకు ముందే న్యూజిలాండ్ సెమీఫైనల్ కు చేరుకోగా, ఈరోజు ఇంగ్లాండ్ వికెట్ల తేడాతో శ్రీలంకపై అతి కష్టంగా గెలిచి సెమీఫైనల్ లోకి అడుగు పెట్టింది. దీనితో డిపెండింగ్ ఛాంపియన్ మరియు ఆతిధ్య ఆస్ట్రేలియా టోర్నీ నుండి నిష్క్రమించింది.
ఆసీస్ సెమిస్ కు వెళ్లాలంటే శ్రీలంక గెలవాల్సిన పరిస్థితుల్లో ఓటమి పాలయ్యి ఆస్ట్రేలియాకు నిరాశను మిగిల్చింది. మొదట టాస్ గెలిచిన శ్రీలంక బ్యాటింగ్ ఎంచుకుని జోరుగా స్కోర్ ను రాబట్టింది. మొదటి పవర్ ప్లే లో అద్భుతంగా ఆడింది.. కానీ ఇన్నింగ్స్ సాగుతున్నా కొద్దీ పిచ్ బౌలర్లకు సహకరించడంతో వికెట్లు కోల్పోయి కేవలం 141 పరుగులకే పరిమితం అయింది. శ్రీలంక ఇన్నింగ్స్ లో ఓపెనర్ నిస్సంక (67) మాత్రమే అర్ధ సెంచరీ సాధించి జట్టు ఆ స్కోర్ చేయడంలో సహాయపడ్డాడు. ఇంగ్లాండ్ ఆ స్కోర్ ను అంత సులభంగా చేధించలేకపోయింది. పవర్ ప్లే లో వికెట్ కోల్పోకుండా 70 పరుగులు చేసిన ఇంగ్లాండ్.. ఆ తర్వాత వరుసగా వికెట్లు కోల్పోయింది.
ముఖ్యంగా స్పిన్నర్లు హాసరంగా , తీక్షణ మరియు ధనంజయ లు ఇంగ్లాండ్ ఆటగాళ్లను బాగా ఇబ్బంది పడ్డారు. ఒక దశలో శ్రీలంక మరో పరుగులు చేసి ఉంటే ఖచ్చితంగా శ్రీలంక గెలిచేది. కానీ 141 పరుగులు ఇంగ్లాండ్ ను గెలుపు నుండి తప్పించలేకపోయాయి. దీనితో టోర్నీ నుండి ఆసిస్ అవుట్ అయింది, గత సంవత్సరం ఛాంపియన్ గా అవతరించిన ఆస్ట్రేలియా ఈ సంవత్సరం సొంత దేశంలో టోర్నీ జరిగినా కనీసం సెమీస్ చేరకపోవడం నిజంగా షేమ్ అంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.    

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: