ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ రేసులో.. ముగ్గురు మనోళ్లే?
ఇకపోతే ఇలా ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ప్రకటించే అవార్డులను దక్కించుకోవడానికి ఎంతో మంది క్రికెటర్లు ఆసక్తి కనబరుస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ప్రతి మ్యాచ్లో కూడా అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ఇక ఐసీసీ అవార్డులను సొంతం చేసుకోవాలని భావిస్తూ ఉంటారు అని చెప్పాలి. ఇకపోతే ఇప్పుడు ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును ప్రకటించేందుకు కొంతమంది ప్లేయర్ల లిస్టును తయారు చేసింది ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్. అయితే ఇలా ఐసీసీ తయారుచేసిన లిస్టులో భారత క్రికెటర్లు సత్తా చాటారు అన్నది తెలుస్తూ ఉంది.
ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ప్రతినెలా ప్రకటించే ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు రేసులో ఇక ఈసారి భారత క్రికెట్ నుంచి ముగ్గురు ప్లేయర్లు నిలిచారు అని చెప్పాలి. అక్టోబర్ నెల కు సంబంధించి పురుషుల విభాగంలో ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ రేసులో అద్భుతమైన ప్రదర్శన చేస్తున్న విరాట్ కోహ్లీ నిలిచాడు అని చెప్పాలి. ఇక అటు మహిళల క్రికెట్లో జమీయా రోడ్రిక్స్, దీప్తి శర్మ ఈ అవార్డు రేసులో ఉన్నారు. అయితే ఇలా ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డులుకు కోహ్లీ పేరును నామినేట్ చేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఇక ఈ లిస్టులో అటు జింబాబ్వే కు చెందిన సికిందర్ రజా, సౌత్ ఆఫ్రికా కు చెందిన డేవిడ్ మిల్లర్ కూడా ఉండడం గమనార్హం.